Dubai Princess: దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన.. ట్రిపుల్ తలాక్ చెప్పిన షైకా మహ్రా
- దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన
- విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొహర్రం పండుగ రోజున దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ దంపతులకు మే 2, 2024న తొలి సంతానంగా ఆడ బిడ్డ జన్మించింది. ఆ సంతోషం ఎంతో కాలం లేకుండానే రెండు నెలలకే ఈ ప్రకటన రావడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ జంట గత ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. 12 నెలల తర్వాత మే 2, 2024న కుమార్తె పుట్టడాన్ని.. ఇద్దరు స్వాగతించారు. ఇంతలో ఏమైందో ఏమో.. కొన్ని వారాల క్రితం యువరాణి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంది. తన బిడ్డను కౌగిలించుకుంటూ.. ‘మేమిద్దరం మాత్రమే’ అని రాసింది. దీంతో అనేక అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఆ అనుమానాలకు ఫుల్స్టాప్ పెడితూ యువరాణి కీలక ప్రకటన చేసింది.
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
యువరాణి పోస్టు సారాంశం..
‘ప్రియమైన భర్తకు.. ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డైవర్స్ యూ’. టేక్ కేర్.. మీ మాజీ భార్య’’ అని షైకా మహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు.. షైకా మహ్రా అకౌంట్ హ్యాక్ అయ్యిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. పలువురు నెటిజన్లు మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కుమార్తె షేక్ మెహ్రా. బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌తో మే 27, 2023న వీరి వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని పేర్కొంటూ భర్త, చిన్నారితో కూడిన ఫొటోలను మహ్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ‘మేమిద్దరం మాత్రమే’ అంటూ చిన్నారితో కూడిన మరో ఫొటోను యువరాణఇ పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే విడాకుల గురించి షేక్ మెహ్రా బహిరంగంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్‌పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
-
Hassan Eisakhil: తండ్రికి తగ్గ తనయుడు.. 28 బంతుల్లో సెంచరీ.. 16 సిక్సర్లతో విధ్వంసం.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!