NTV Telugu Site icon

Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిని టార్గెట్ చేసిన లెబనాన్ డ్రోన్..

Drone

Drone

Drone Targets Israel PM: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యంగా లెబనాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్ ఈరోజు (శనివారం) దక్షిణ హైఫాలోని సిజేరియాలోని నెతన్యాహు ప్రైవేట్ నివాసం సమీపంలో పేలిపోయిందని రాయిటర్స్ నివేదించింది. గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ చంపేసిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగడంతో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, నెతన్యాహు, అతని భార్య అక్కడ లేరని ప్రధాని ప్రతినిధి చెప్పారు. ఇక, లెబనాన్ నుంచి ప్రయోగించిన మరో రెండు డ్రోన్‌లు టెల్ అవీవ్ ప్రాంతంలో వచ్చిన తర్వాత సైరన్‌లు మోగడంతో గాల్లోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ సైనికులు కూల్చివేశారు. అయితే మూడోది సిజేరియాలోని ఓ భవనాన్ని ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ డ్రోన్ ఢీ కొట్టడంతో భవనంలో కొంత భాగం దెబ్బతిన్నదని సౌదీ అవుట్‌లెట్ అల్-హదత్ వెల్లడించింది. అలాగే, సిజేరియాలోని భవనాన్ని ఢీకొనడానికి ముందు డ్రోన్ లెబనాన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నుంచి వచ్చిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.

Read Also: JR. NTR : కాస్త తగ్గిన దేవర.. ఇప్పటికి ఎన్ని కోట్లు లాభమంటే..?

అయితే, ఇక, ఇజ్రాయెల్‌పై హమాస్ గత ఏడాది అక్టోబరు 7న దాడికి ప్లాన్ చేసిన ప్రధాన నిందితుడు యాహ్యా సిన్వార్ కోసం ఒక సంవత్సరం పాటు గాలించిన తర్వాత ఈ నెల 16న ఇజ్రాయెల్ దళాలచే చంపబడ్డాడు. ఆ తర్వాతే ప్రధాని నెతన్యాహు ఇంటీ సమీపంలో ఈ డ్రోన్ దాడి జరిగింది. ఇక, హమాస్- ఇజ్రాయెల్ మధ్య తక్షణ కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోరాటం కొనసాగిస్తామని గాజాలోని మిలిటెంట్ గ్రూప్ ప్రతిజ్ఞ చేసింది. సిన్వార్ యొక్క డిప్యూటీ ఖలీల్ అల్-హయ్యా, హమాస్ నాయకుడు మరణించినప్పటికీ, గతంలో కంటే బలంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. నెతన్యాహును అంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం అని హమాస్ వెల్లడించింది. ఈరోజు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. సిన్వార్ మరణం బాధకరం అయినప్పటికి.. హమాస్ ఇంకా ఉనికిలోనే ఉందన్నారు.