యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కాస్త నెమ్మదించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నుండి అదరగొట్టిన దేవర 21 రోజుల పాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సెప్టెంబరు 27న రిలీజైన దేవర దసరా రోజు రిలీజైన భారీ సినిమాల కంటే ఎక్కవు కలెక్షన్స్ రాబట్టి దసరా విన్నర్ గా నిలిచింది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవర కు లాంగ్ రన్ లో కలిసొచ్చింది. దీంతో దేవర కొనుగోలును చేసిన ప్రతి ఒకరు లాభాల చూసారు.
Also Read : Ajay : దేవర పార్ట్ – 2 గురించి కీలక వ్యాఖ్యలు చేసిన అజయ్..
చాలా కాలం తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, పార్కింగ్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు ఇలా అందరు లాభాలు చూసిన సినిమా దేవర అనే చెప్పక తప్పదు. మరోవైపు 2024లో వరుసగా కోటి రూపాయల షేర్ ను ఎక్కువ రోజులు అందుకున్న టాప్ సినిమాలలో దేవర 2వ ప్లేస్ లో నిలిచింది. వరుసగా 20 రోజులు కోటి గ్రాస్ అందుకుని ఫస్ట్ ప్లేస్ లో ఉంది ప్రశాంత్ వర్మ హనుమాన్, ఇక 19 రోజుల పాటు దేవర కోటి రూపాయలు అందుకోగా 13 రోజులతో కల్కి 3వ స్తానంలో ఉంది. 3వారలు కంప్లిట్ చేసుకున్న దేవర మెజారిటీ సెంటర్స్ లో పర్సెంటేజ్ కింద రన్ చేస్తున్నారు. దీపావళి వరకు దేవర థియేటర్ రన్ ఉంటుంది. ఇక లాభాల సంగతి చుస్తే ఇప్పటివరరకు అటుఇటుగా దాదాపు రూ. 70 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికి దేవర వెరీ డీసెంట్ కలక్షన్స్ సాధిస్తూ వెళుతోంది. ఫైనల్ రన్ ముగిసే నాటికి దేవర ఎన్ని లాభం వస్తోందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.