కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. గత కొన్ని రోజులుగా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు బయటపడిన తరువాత కరోనా ఉధృతి భారీగా పెరిగింది. కరోనా కారణంగా అన్నింటిని మూసేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా తగ్గడం లేదు. పైగా కొత్త కొత్త పేర్లతో వైరస్ పుట్టుకొస్తున్నది. ఇజ్రాయిల్లో ఇటీవలే ఫ్లురోనా అనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇన్ఫ్లుయెంజా, కరోనా రెండు ఒకే వ్యక్తిలో బయటపడితే ఫ్లురోనా అని పిలుస్తున్నారు.
Read: కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి పాజిటివ్…
ఈ రకం కేసులు మొదట ఇజ్రాయిల్లో బయటపడినట్టు చెబుతున్నా, ఏడాది క్రితమే ఇలాంటి లక్షణాలతో ఓ వ్యక్తి అమెరికాలోని ఆసుపత్రిలో చేరినట్టు నివేదికలు చెబుతున్నాయి. క్రిస్మస్ తరువాత ఇలాంటి కేసులు అధికంగా హ్యుస్టన్లో బయటపడుతున్నాయి. అయితే, ఈ ఫ్లురోనా కాదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది. రెస్పిరేటరీ ఆర్గాన్స్పై ఫ్లురోనా ప్రభావం చూసిస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లురోనా కేసులు అటు బ్రెజిల్లో కూడా బయటపడుతున్నాయి. బ్రెజిల్లో ఇప్పటికే 6 కేసులను అధికారికంగా గుర్తించగా, మరో 17 కేసులను గుర్తించాల్సి ఉన్నది. ఫ్లురోనా చాపకింద నీరులా వ్యాపిస్తోందని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.