Jaishankar: మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు.. ఆధారాలుంటే ఇవ్వండి.. కెనడాకు స్ట్రాంగ్ మెసేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య తీవ్ర వివాదానికి దారి తీశాయి. కెనడా ప్రధాని మాట్లాడుతూ.. ఈ హత్యలో భారత ప్రేమయం ఉందని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు భారత్ కూడా గట్టిగానే స్పందిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కెనడాకు గట్టిగానే బదులిచ్చాడు. కెనడా చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య, దీన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జైశంకర్ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెనడా-ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులపై మీడియా ప్రశ్నలు అడిగింది. ‘‘హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి కెనడా వద్ద నిర్ధిష్ట సమాచారం ఉంటే భారత పరిశీలించేందుకు సిద్ధంగా ఉందని, మేమేం తలుపులు మూసుకుని కూర్చోలేదు. కానీ కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కాదా..!’’ అని జైశంకర్ అన్నారు. ఈ అంశంపై ఇరు దేశాలు చర్చించి, విభేదాలను పరిస్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
Read Also: Jammu Kashmir: ఎల్ఓసీ వెంబడి చొరబాటు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చిన ఇండియన్ ఆర్మీ..
కెనడా ప్రభుత్వంతో భారత్ చాలా కాలంగా ఇబ్బందులు పడుతోందని, ఉగ్రవాదంపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణమని జైశంకర్ అన్నారు. భారత్ లో నేరాలకు పాల్పడిన వ్యక్తులు కెనడాలో ఉన్నారని, వారిని అప్పగించాల్సిందిగా భారత్ కోరినప్పటికీ కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదని, భారత వ్యతిరేఖ శక్తులు తమ పనిని కొనసాగిస్తూనే ఉన్నాయని జైశంకర్ ఫైర్ అయ్యారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మా దౌత్య కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు దౌత్యవేత్తలను బెదిరించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే నగరంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తుతెలియని వ్యక్తులు గురుద్వారా వద్ద కాల్చేశారు. అయితే ఈ హత్యను భారత్ ఏజెంట్లే చేశారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం ముదిరింది. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే, ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. కెనడా ఆరోపణల్ని అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశంగశాఖ ధ్వజమెత్తింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!