NTV Telugu Site icon

Donald Trump: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ.. నిషేధం ఎత్తివేత

Trump

Trump

Donald Trump To Be Allowed Back On Facebook, Instagram After 2-Year Ban: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తిరిగి అనుమతించనున్నారు. యూఎస్ కాపిటల్ పై 2021లో జరిగిన దాడి తర్వాత ట్రంప్ పై నిషేధం విధించాయి. రెండేళ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్దరించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం మెటా మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లేగ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే దీనిపై ట్రంప్ కానీ, అతని మద్దతుదారులు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ట్రంప్ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ కు మళ్లీ వస్తారా..? లేదా..? అనేది ప్రస్తుతానికి తెలియదు.

Read Also: Republic Day: ఢిల్లీలో హై అలర్ట్.. 6 వేల మందితో భద్రతా ఏర్పాట్లు..

2021 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో బైడెన్ ఎన్నికల గెలుపు ధృవీకరణను ఆపేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ట్విట్టర్ తో సహా ఫేస్ బుక్, ఇన్ స్టాలు బ్యాన్ విధించాయి. దీని తర్వాత ట్రంప్ సొంతగా ‘ట్రూత్ సోషల్’ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ని ప్రారంభించారు. 88 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్న అతని ట్విట్టర్ ఖాతా కూడా గతంలో బ్యాన్ చేయబడింది. ఇటీవల ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ రీ ఎంట్రీపై పోల్ నిర్వహించారు. మెజారిటీ యూజర్లు ట్రంప్ రీఎంట్రీకి ఓటు వేయడంతో ట్విట్టర్ లో కూడా అతని ఖాతాను పునరుద్దరించారు.