Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు సపోర్టుగా.. ఆ దేశంపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్టన్లు ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది అంతర్జాతీయ ప్రపంచానికి అవమానంగా పేర్కొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ట్రంప్ రాసిన లేఖలో ఈ కేసును కొనసాగించొద్దని తెలిపారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై అమెరికా విచారణ ప్రారంభిస్తుందని హెచ్చరించారు.
Read Also: AP Liquor Case: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. రిటైర్డ్ ఐఏఎస్‌కు సిట్ నోటీసులు
ఇక, బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తనకు బాగా తెలుసు.. అతడితో కలిసి తాను పని చేశానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలు బోల్సోనారోను ఎంతో గౌరవంగా చూశారని వెల్లడించారు. అతని విషయంలో ప్రస్తుతం బ్రెజిల్ సర్కార్ అనుసరిస్తున్న విధానం చాలా అవమానకరమని చెప్పుకొచ్చారు. కాగా, బోల్సోనారో తిరుగుబాటు కేసుపై ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ ఇటీవల ఘాటుగా రియాక్ట్ కావడంతో భారీ సుంకాలతో బ్రెజిల్‌కు బిగ్ షాకిచ్చాడు.
Read Also: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. భారీగా ట్రాఫిక్ జామ్.. విమాన రాకపోకలకు అంతరాయం
అయితే, బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూలా నుంచి అధికారాన్ని అధికారం దక్కించుకునేందుకు జైర్ బోల్సోనారో కుట్ర చేశారనే ఆరోపణలున్నాయి. అయితే, సైన్యం నుంచి ఆయనకు సపోర్ట్ అందకపోవడంతో ఆ కుట్ర విఫలమైందని పేర్కొంటున్నారు. బోల్సోనారో ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు, ఆగస్టు ఒకటి నుంచి బ్రెజిల్ వస్తువులపై 50 శాతం యూఎస్ సుంకం అమల్లోకి వస్తుంది.. ఇతర ఆర్థిక వ్యవస్థల గడువుకు ఇది సమానమని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇక, బ్రెజిల్ తో పాటు అల్జీరియా, ఇరాక్, లిబియా, శ్రీలంకపై 30, బ్రూనై, మోల్డోవాపై 25, ఫిలిప్పీన్స్ 20 వంటి దేశాలపై సుంకాలు విధించాడు.
