అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసి.. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ‘‘అమెరికా ఫస్ట్ అనేది మా నినాదం.. నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. చిన్న సమస్యలను కూడా పరిష్కరించే స్థితిలో మన ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు.. అమెరికా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
‘‘తుఫాన్లు అమెరికాను అతలాకుతలం చేశాయి. అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాం. విద్య, ప్రజావైద్యం మరింత మెరుగుపరచాల్సి ఉంది. న్యాయవ్యవస్థను పటిష్టం చేస్తాం. అమెరికా ప్రజలకు నేడు స్వాతంత్రత్య దినం. దేశ సరిహద్దుల రక్షణ మనకు ముఖ్యం.. శాంతిభద్రతల విషయంలో మరింత కఠినతరంగా ఉండాలి. అమెరికా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలి.. దేవుడి దయతో తుపాకీ కాల్పుల నుంచి తృటిలో బయటపడ్డా. 2025 మనకు స్వేచ్ఛాయుత ఇయర్.’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.