Trump China Visit: డ్రాగన్ గడ్డపై అడుగు పెట్టబోతున్న ట్రంప్ .. బీజింగ్ వేదికగా ఏం జరగబోతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump China Visit: రెండు అగ్రదేశాల మధ్య ఈనెలలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకోబోతుంది. ఇంతకీ ఆ రెండు అగ్రదేశాలు ఏంటో తెలుసా.. ఒకటి అమెరికా అయితే మరొకటి చైనా. ఒక దేశం అగ్రదేశంగా వెలుగొందుతుంటే.. మరొక దేశం ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇది నిజంగా నిజం.. ఈ విషయాన్ని స్వయంగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 13 నుంచి మే 15 వరకు చైనాలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ మూడు రోజుల పర్యటనను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉన్నత స్థాయి పర్యటనను చైనా వార్తా సంస్థ జిన్హువా ధృవీకరించింది. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కీలక ద్వైపాక్షిక సమస్యలపై వివరంగా చర్చిస్తారని సమాచారం. ఈ పర్యటన అంతర్జాతీయ వేదికపై బీజింగ్ – వాషింగ్టన్ల మధ్య ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- H-1B Visa: ఉద్యోగం పోతే అమెరికాలో ఉండటం కష్టమేనా? 60 రోజుల గడువు తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
అమెరికాను హెచ్చరించిన చైనా..
గత నెలలో హోర్ముజ్ జలసంధిని అమెరికా నేవీ దిగ్బంధనం విధించడం, ఇరాన్‌తో చైనాకున్న ద్వైపాక్షిక సంబంధాలలో జోక్యం చేసుకోవడం వంటి వాటిపై ఒక సీనియర్ చైనా అధికారి అమెరికాను హెచ్చరించారు. ఈ హెచ్చరికలను చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మాకు ఇరాన్‌తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. ఇతరులు మా వ్యవహారాలలో జోక్యం చేసుకోరని ఆశిస్తున్నాము. హోర్ముజ్ జలసంధి చైనాకు తెరిచే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని ట్రంప్ నేవీ దిగ్బంధించడంతో, ఈ కీలకమైన గల్ఫ్ జలమార్గంలో చైనాకు చెందిన నౌకలు ప్రయాణిస్తుంటే.. వాటిని ట్రంప్ నేవీ టార్గెట్ చేయవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటి మధ్యలో ట్రంప్ చైనా పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా మారిందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!