Site icon NTV Telugu

Donald Trump : ఎలాన్‌ మంచోడే.. కానీ.. నేను ఆ పని చేయను..

Trump

Trump

ప్రపంచ ధనికుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవలే ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాదారుడయ్యారు. అయితే ఆ తరువాత మొత్తం ట్విట్టర్‌నే కొంటానని ప్రకటించారు. దానికి కోసం కావాల్సిన వ్యూహాలను రచించి.. చివరికి ట్విట్టర్‌ యాజమాన్యం దిగివచ్చేలా చేశారు. ఎట్టకేలకు ఎలాన్‌ మస్క్‌ అనుకున్నట్లు ట్విట్టర్‌ను హస్తగతం చేసుకోబుతున్న వేళ… ఎలాన్‌ మస్క్ ముందు రిపబ్లికన్లు ఓ కోరికనుంచారు. అప్పట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన.. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ యాజమాన్యం రద్దు చేసింది.

విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేస్తున్నారని డోనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్‌ తొలగించింది. అయితే ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ట్విట్టర్‌ వెళుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించాలని ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరుతున్నారు. అయితే దీనిపై స్పందించిన డోనాల్డ్‌ ట్రంప్‌.. ఎలన్ మ‌స్క్ చాలా మంచివార‌ని, అందులో అనుమానం లేద‌న్నారు. అయితే తాను మాత్రం తిరిగి ట్విట్ట‌ర్ ఖాతాను తెరిచేది లేద‌ని స్ప‌ష్టం చేశారు ట్రంప్‌. నేను మాత్రం ట్రుథ్ సోష‌ల్‌లోనే ఉంటానన్నారు.

Exit mobile version