SpiceJet: స్పైస్‌జెట్‌పై కేంద్రం సీరియస్.. 8 వారాల పాటు ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA Ordered SpiceJet To Operate 50 Percent Flights For 8 Weeks: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈమధ్య వరుసగా ప్రమాదాలు సంభించిన నేపథ్యంలో.. డీజీసీఏ ఆ సంస్థపై ఆంక్షలు విధించింది. 8 వారాల పాటు 50 శాతం మాత్రమే విమాన సర్వీసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందే.. 18 రోజుల వ్యవధిలో 8 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే!
కాగా.. గత నెల 19 నుంచి స్పైస్‌జెట్ విమానాల్లో ఏకంగా 8సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19వ తేదీన 185 ప్రయాణికులతో పాట్నా నుంచి బయలుదేరిన ఓ విమానాన్ని పక్షి ఢీకొనడంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు.. జబల్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ సమస్య తలెత్తింది. అనంతం జూన్ 24, 25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్‌లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తడంతో.. ఆ రెండు విమాన సర్వీసుల్ని క్యాన్సిల్ చేశారు. ఆ మరుసటి రోజే చెన్నై నుంచి కోల్‌కతా బయలుదేరిన స్పైస్‌జెట్ కార్గో విమానం వెదర్ రాడార్ పని చేయకపోవడంతో.. అది వెనక్కు వచ్చేసింది. ఈ నెల 2వ తేదీన ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు బయలుదేరిన ఫ్లైట్‌లో టేకాఫ్ సమయంలోనే క్యాబిన్‌లో పొగలు వచ్చాయి.
Also Read
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్‌ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
- Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
ఇలా తరచూ ఏదో ఒక లోపం తలెత్తుతుండడంతో.. తొలుత వివరణ ఇవ్వాలంటూ డీజీసీఏ నోటీసులు పంపింది. ఆ వెంటనే మరో సమస్య వెలుగులోకి వచ్చింది. దుబాయ్ – మధురై విమానం బోయింగ్ బి737 మ్యాక్స్ ఫ్రంట్ వీల్ సరిగ్గా పని చేయలేదు. ఈ నేపథ్యంలోనే సీరియస్ అయిన కేంద్రం.. 8 వారాల పాటు కేవలం 50 శాతం విమాన సర్వీసులే నిర్వహించాలంటూ ఆంక్షలు విధించింది. ఇకనుంచైనా స్పైస్‌జెట్ సీరియస్‌గా వ్యవహరించి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు ఈ ఆంక్షలు విధించడం జరిగింది.
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్‌పార్క్‌కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?