కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్‌లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ఈ తరహాలో కేసులో యూకేకు వణుకుపుట్టిస్తున్నాయి.. యూకేతో ఆగని కొత్త వేరియంట్ కేసులు.. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌లో కూడా వెలుగు చూస్తున్నాయి..
Read Also: ఈ నెల 28న రాష్ట్ర కేబినెట్ భేటీ
కాగా, ఏడాది క్రితం తొలిసారి భారత్‌లో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియెంట్‌లో.. ఇప్పటి వరకు 55 సార్లు జన్యుపరమైన మార్పులు జరిగాయని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.. అవేవీ పెద్దగా ప్రమాదకరంగా మారలేదు.. కానీ, ఇప్పుడు మాత్రం ఏవై.4.2 వ్యాప్తిపై కలవరపెడుతోంది.. ఈ ఏడా జులైలో ఈ వేరింయట్ తొలిసారి యూకేలో బయటపడగా.. కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ మ్యుటేషన్లు అయిన ఏ222వీ, వై145హెచ్‌ల సమ్మేళనంగా ఈ కొత్త వేరియెంట్ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.