Danny Masterson Found Guilty Of 2 Counts Of Rape: అత్యాచారం కేసులో హాలీవుడ్ నటుడు డానీ మాస్టర్‌సన్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2001 – 03 మధ్య కాలంలో అతడు ముగ్గురిపై అత్యాచారానికి పాల్పడగా.. రెండు కేసుల్లో దోషిగా తీర్పునిస్తూ, 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే.. మూడో అత్యాచారం ఆరోపణలపై జ్యూరీ ఇంకా తీర్పుని ప్రకటించాల్సి ఉంది. గత ట్రయల్‌లోని జ్యూరీ ఏకగ్రీవ నిర్ణయానికి రాకపోవడంతో కేసుని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు రెండో ట్రయల్‌లో భాగంగా.. రెండు కేసుల్లో అతడు దోషిగా తేల్చుతూ జ్యూరీ తీర్పునివ్వడంతో, ఆ నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి 30 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మౌనంగా ఉండిపోగా.. అతని భార్య, నటి బిజు ఫిలిప్స్ మాత్రం కోర్టులోనే బోరుమంది.
1st June changes: ఈరోజు నుండి దేశంలో వచ్చిన ఐదు ప్రధాన మార్పులివే
కాగా.. డానీ మాస్టర్‌సన్ 2001లో 23 ఏళ్ల యువతిపై, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2003 చివర్లోనూ మరో యువతిని (23) తన ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై 2020 జూన్‌లో విచారణ జరిపిన న్యాయస్థానం.. అతనికి జైలు శిక్ష విధించింది. అదే రోజు డానీ 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి, జైలు నుంచి బయటకొచ్చాడు. తాజాగా మరోమారు విచారణ జరగ్గా.. డానీనిద న్యాయస్థానం నిందితుడిగా తేల్చింది. అయితే.. 2001, 2003లో అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు అయ్యాయి. కానీ.. 2003 ఏడాది చివర్లో హాలీవుడ్ హిల్స్‌లోని తన ఇంట్లో ఓ యువతిని అత్యాచారం చేసిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కావాల్సి ఉంది. మరోవైపు.. డానీకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై ఓ బాధితురాలు ఆనందం వ్యక్తం చేసింది. డానీకి తగిన శాస్తి జరిగిందని, న్యాయం గెలిచిందని పేర్కొంది.
California: కుక్క కోసం లగ్జరీ ఇళ్లు.. ఎంత పెట్టి నిర్మించాడో.. తెలిస్తే షాకవ్వాల్సిందే
ఇదిలావుండగా.. 1998లో లాంచ్ అయిన రెట్రో సిట్‌కామ్ ‘దట్ సెవెంటీస్ షో’తో డానీ మాస్టర్‌సన్ పాపులారిటీ గడించాడు. ఆ షోతో వచ్చిన ఫేమ్ పుణ్యమా అని.. ఇతని ఫిల్మ్ కెరీర్ సాఫీగా సాగింది. అయితే.. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా.. 2017లో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ‘ద రాంచ్’ అనే కామెడీ షో నుంచి డానీ మాస్టర్‌సన్‌ను తొలగించింది.