Cricket: మన మహిళల క్రికెట్‌కి మంచి రోజులు.. ఈసారి వరల్డ్ కప్ ఇండియాలోనే
Cricket: మన దేశంలో మహిళల క్రికెట్‌కి మరింత మంచి రోజులు రానున్నాయి. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కి ఈసారి ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2021లో జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ టోర్నీ కరోనా కారణాంగా 2022లో జరిగింది. ఈ నేపథ్యంలో 2025 వరల్డ్ కప్‌ని మన దేశంలో నిర్వహిస్తారు. ఈ మేరకు బీసీసీఐ బిడ్ వేసింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నిన్న మంగళవారం జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహణ అవకాశాన్ని విజయవంతంగా చేజిక్కించుకుంది.
మన దేశంలో ఈ పోటీలు చివరిసారిగా 2013లో జరిగాయి. అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియా వేదిక కాబోతోంది. మన దేశంలో 2016లో టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది. ఆ తర్వాత మహిళల క్రికెట్‌కి సంబంధించిన ఒక్క గ్లోబల్ టోర్నీని కూడా ఇక్కడ నిర్వహించలేదు. అదే సంవత్సరం ఇండియాలో టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్‌తోపాటు మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను కూడా ఒకేసారి నిర్వహించటంతో మహిళల పోటీలకు కాస్త ప్రాధాన్యత తగ్గింది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఉమెన్స్ క్రికెట్ బాగా అభివృద్ధి చెందింది. ప్రజాదరణ కూడా పొందింది.
Also Read
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
- Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
read more: Business Headlines: బ్యాంకుల్లో మూలుగుతున్న 48,262 కోట్ల రూపాయలు ఎవరివో?
మహిళల క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐసీసీ ముందుకొచ్చింది. బీసీసీఐలో సైతం ఇదే దృక్పథం పెరిగింది. ‘ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ నిర్వహణపై ఆసక్తిగా ఉన్నాం. అందుకు తగ్గట్లే నిర్వహణ హక్కులు దక్కటం చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు రోజురోజుకీ పాపులారిటీ పెరుగుతోంది. అందుకే ప్రపంచకప్ నిర్వహించాలనేది సరైన సమయంలో సరైన దిశగా తీసుకున్న నిర్ణయమని చెప్పొచ్చు. బీసీసీఐ ఐసీసీతో సమన్వయం చేసుకొని ఈ టోర్నమెంట్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నట్లు ఐసీసీ పేర్కొంది.
దేశంలో ఉమెన్స్ క్రికెట్‌ని క్షేత్ర స్థాయి నుంచి ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జైషా అన్నారు. ప్రపంచ కప్ పోటీల నిర్వహణతో అది నెక్‌స్ట్ లెవల్‌కి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెన్స్ వన్డే వరల్డ్ కప్ (1975) కన్నా రెండేళ్ల ముందే (1973లోనే) ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రారంభమైనా ఇది ఇంకా వెనకబడి ఉండటం గమనార్హం. పురుషుల ప్రపంచ కప్ కన్నా మహిళల ప్రపంచ కప్ ముందే ప్రారంభమైందంటే అసలు నమ్మశక్యంగా లేదని చెప్పొచ్చు.
ఇదిలాఉండగా.. 2025లో ఇండియాలో నిర్వహించే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ పోటీలో ఆతిథ్య దేశంతోపాటు 2022-25 మధ్య కాలంలో ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో టాప్-5లో నిలిచే దేశాలకు డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుంది. మిగతా రెండు జట్లను ఆరు గ్లోబల్ క్వాలిఫయర్ టీమ్‌ల నుంచి ఎంపిక చేస్తారు. ఈ ఆరు జట్లలో నాలుగు జట్లను ఐడబ్ల్యూసీ ర్యాంకుల నుంచి, మిగిలిన రెండు జట్లను ఐసీసీ ఉమెన్స్ వన్డే టీమ్ ర్యాంకుల నుంచి ఎంపిక చేస్తారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?