Cow Arrest: బాలుడిని చంపినందుకు ఆవు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చట్టాలు ఉంటాయి. అక్కడి చట్టాలు కొన్ని మనకు వింతగానే అనిపిస్తుంటాయి. ఇటీవల ఓ గొర్రె ఒక మహిళను చంపినందుకు అరెస్ట్ చేసిన విషయం తెగ వైరల్ అయింది. తాజాగా ఇలాంటి ఘటనే మళ్లీ జరిగింది. ఒక బాలుడిని చంపినందుకు ఆవును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం సౌత్ సుడాన్ లో జరిగింది.
ఈ విచిత్రమైన ఘటనలో 12 ఏళ్ల బాలుడిని చంపిన ఆవును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు దాని యజమానిని పోలీసులు అదుపులోకి తీసకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత వారం సాయంత్రం ఒక పొలం దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా.. పిల్లవాడిపై ఆవు దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు అక్కడిక్కడే మరణించాడు. ఆవు నాగలి లాగే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
ఈ ఘటనపై దక్షిణ సుడాన్ పోలీస్ అధికారి ఎలిజా మాబోర్ మాట్లాడుతూ.. ఆవును రుంబెక్ సెంట్రల్ కౌంటీలోని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశామని.. బాలుడిని పోస్ట్ మార్టంకు తరలించి ఆ తరువాత అంత్యక్రియల కోసం ఇంటికి పంపించామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే దేశానికి చెందిన ఓ 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళను పొట్టేతలు పక్కటెముకల్లో పొడిచిపొడిచి చంపింది. ఈ ఘటనలో పొట్టేలును అరెస్ట్ చేసి.. దాన్ని సైనిక శిబిరంలో ఉంచారు. పొట్టేలుకు మూడేళ్ల కఠిక కారాగార శిక్ష విధించారు. ఈ శిక్ష ముగిశాక అక్కడి చట్టాలు, సంప్రదాయాల ప్రకారం చాపింగ్ కుటుంబానికి పొట్టేలును అప్పగించనున్నారు.
తాజావార్తలు
-
Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన