NTV Telugu Site icon

Nikki Haley: రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది.. ఘాటు వ్యాఖ్యలు చేసిన నిక్కీ హేలీ..

Nikki Haley

Nikki Haley

Nikki Haley: వచ్చే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ బరిలో నిలవనున్నారు. చెప్పకనే చెబుతూ.. ఆమె అప్పుడే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించినట్లయింది. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ చైనా చరిత్ర బూడిద కుప్పగా ముగుస్తుందంటూ విమర్శించారు. పూర్వపు సోవియట్ యూనియన్ లాగే చైనా పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

Read Also: Bone Density: బలమైన ఎముకల కోసం.. ఈ సప్టిమెంట్స్ తీసుకుంటే చాలు!

51 ఏళ్ల నిక్కీ హెలీ సౌత్ కరోలినాకు రెండు సార్లు గవర్నర్ గా పనిచేశారు. ఇటీవల చైనా స్పై బెలూన్ వివాదంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలో నిక్కీ హెలీ చైనాను నేరుగా హెచ్చరించారు. సౌత్ కరోలినాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి హేలీ చైనాను దుయ్యబట్టారు. అమెరికా సైన్యం గతంలో కన్నా చాలా బలంగా ఉందని.. మరింత సామర్థ్యాన్ని పెంచుకుందని ఆమె అన్నారు. బలమైన సైన్యం యుద్దాలను ప్రారంభించదని.. యుద్ధాలను నిరోధిస్తోందని ఆమె వెల్లడించారు. మేము మా స్నేహితులు ఇజ్రాయిల్, ఉక్రెయిన్ తరుపున నిలబడటంతో పాటు శత్రువులు ఇరాన్, రష్యాలను నిలువరిస్తాం అని అన్నారు. సోవియట్ యూనియన్ లాగే చైనా చరిత్ర కూడా ముగుస్తుందని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే జో బైడెన్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు నిక్కీ హెలీ. 20వ శతాబ్ధపు నాయకులను నమ్మితే 21 శతాబ్ధపు పోరాటంలో అమెరికా గెలవదని అన్నారు. 75 ఏళ్లలో యూరప్ లో అతిపెద్ద యుద్ధాన్ని రష్యా ప్రారంభించిందని అన్నారు. వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయన బాస్ ట్రంప్ పైనే నిక్కీ హెలీ పోటీ చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరగాల్సి ఉంది. నిక్కీ హేలీ సిక్కు తల్లిదండ్రులు అజిత్ సింగ్ రంధవా, రాజ్ కౌర్ రంధవాకు జన్మించారు. వీరి కుటుంబం 1960లో పంజాబ్ నుంచి కెనడాకు వలసవెళ్లారు. అక్కడ నుంచి అమెరికాకు వెళ్లారు.