Gold: సముద్ర గర్భంలో.. ధగధగల బంగారు నిధి.. విలువెంతో తెలిస్తే షాకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను కొలంబియా అధికారులు గుర్తించారు. 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. 1708లో బ్రిటీష్ దాడిలో శాన్‌జోస్ యుద్ధ నౌక మునిగిపోయింది. అయితే ఆ నాటి తెరచాప నౌక శిథిలాలను గుర్తించారు. ఆ నౌకల్లో తరలించిన సుమారు 1.32 లక్షల కోట్ల (17 బిలియన్ల డాలర్ల) విలువైన బంగారు నాణేలు, మట్టి, పోర్సెలిన్ పాత్రలు ఉన్నట్లు తాజాగా కనుగొన్నారు. ఈ రెండు పడవలూ 200 ఏళ్ల నాటివని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది.
ఒక రిమోట్ ఆధారిత నావను సముద్ర గర్భంలోకి సుమారు 3,100 అడుగుల లోతులోకి పంపి ప్రధాన ఓడ శాన్‌జోస్ శిథిలాల వద్ద ఉన్న ఆ పడవలను వీడియో తీయించారు. వాటిలో బంగారు నాణేలు, పోర్సెలిన్ పాత్రలు ఉన్నట్లు నిర్ధరణ అయింది. శాన్‌జోస్ ఓడను 2015లో కనుగొన్నారు. స్పానిష్ సక్సెసన్ యుద్ధంలో బ్రిటీష్ నౌకలు జరిపిన దాడిలో శాన్‌జోస్ నౌక నీట మునిగింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో సుమారు 600 మంది ఉన్నారు. వారితో పాటు బంగారు నాణాలు, ఆభరణాలు, ఇంకా బంగారు సామాగ్రి ఉన్నాయి. అయితే అప్పటి నౌకా దళానికి చెందిన రెండు ఓడల శిథిలాలను ఇప్పుడు గుర్తించారు. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు.
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
తాజావార్తలు
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!