ప్రపంచంలో అన్ని దేశాలది ఒకదారైతే, ఉత్తరకొరియాది మరోదారి. ప్రపంచంతో సంబందం లేకుండా ఆ దేశంలో ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. అధినేత కిమ్ కనుసన్నల్లో పాలన సాగుతున్నది. కరోనా సమయంలో రష్యా, చైనా దేశాలతో ఉన్న సరిహద్దులను మూపివేయడంతో ఆ దేశం ఆర్ధికంగా చితికిపోయింది. కరోనా ప్రభావంతో చైనా నుంచి దిగుమతులను తగ్గించేసింది. దీంతో దేశంలో ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడింది.
Read: రివ్యూ: షేర్నీ (హిందీ సినిమా)
ఆకలితో ప్రజలు అలమటించిపోతున్నారు. ధరలు ఆకాశాన్ని తాకాయి. కాఫిపోడి ప్యాకెట్‌ను ఆ దేశంలో ఏడు వేల రూపాయలకు అమ్ముతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నయో అర్ధంచేసుకొవచ్చు. దేశంలో వ్యవసాయరంగం కుదేలవ్వడంతో ఉత్తరకొరియా నెత్తిమీద తాటికాయ పడినట్టయింది. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం కోలుకుంటేనే ఉత్తరకొరియాలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. లేదంటే మాత్రం కొరియా ఈ పరిస్థితుల నుంచి బయటపడటం మరింత కష్టం అవుతుంది.