Pakistan: దైవదూషణలో చైనీయుడి అరెస్ట్.. మిత్రదేశం విషయంలో పాక్ ఏం చేస్తుందో చూడాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తో పాటు ఇతర ఇస్లామిక్ దేశాల్లో ‘‘దైవదూషణ’’కు తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మరణశిక్షలు విధించిన సందర్భాలు ఎక్కువ. పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే ఎలాంటి అనుమానం ఉన్నా కూడా దైవదూషణ వంటి కేసుల్లో మతోన్మాదులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జరిగాయి. 2021లో ఓ శ్రీలంక జాతీయుడిని దైవదూషణ పేరుతో ప్రజలే నిప్పంటించి కాల్చి చంపారు. దీని తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్ నే అటాక్ చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ చైనా జాతీయుడిని దైవదుషణ ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో డ్యామ్ ప్రాజెక్టులో ఇతడు పనిచేస్తున్నాడు. చైనా గెజౌబా గ్రూప్ కంపెనీలో ఇంజనీర్‌గా ఉన్న వ్యక్తి.. రంజాన్ ప్రార్థనల కోసం చాలా బ్రేకులు తీసుకోవడంపై కార్మికులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలపై అతడిపై దాడి చేసేందుకు సిబ్బంది గుమిగూడిన సమయంలో పోలీసులకు ఫోన్ చేశారు. అయితే మిత్రదేశం చైనాకు చెందిన వ్యక్తి కావడం, పాకిస్తాన్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో చైనీయులు పనిచేస్తుండటంతో ఈ సంఘటనపై పాకిస్తాన్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్‌లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
- ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Read Also: Golden Temple: అమ్మాయి ముఖంపై భారత జెండా..స్వర్ణదేవాలయంలోకి అనుమతి నిరాకరణ..
ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని మారుమూల కోహిస్తాన్ ప్రాంతంలోని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జూలై 2021 ఆత్మాహుతి బాంబు దాడిలో తొమ్మిది మంది చైనా జాతీయులు మరణించిన తర్వాత దాసు జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న చైనా జాతీయులకు భారీ భద్రతను కట్టుదిట్టం చేసింది. పాకిస్తాన్ లో ఓ విదేశీయుడిపై దైవదూషణ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు విదేశీయులపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
డిసెంబర్ 2021లో, సియాల్‌కోట్‌లోని ఫ్యాక్టరీ మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీలంక జాతీయుడు ప్రియంత దియవదనాగే (48)ను దైవదూషణ ఆరోపణలపై కొట్టి చంపి, అతని శరీరానికి నిప్పంటించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చైనా వ్యక్తిపై దైవదూషణ ఫిర్యాదును నమోదు చేయాలా వద్దా..? అనే దానిపై నిర్ణయించడానికి సోమవారం గిరిజన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ వివాదం పాక్, చైనాల మధ్య దౌత్యపరమైన సంఘటనగా మారే అవకాశం ఉండటంతో పాకిస్తాన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
Protests continued in Kohistan of Khyber Pakhtunkhwa,blocking KKH against Chinese citizen, who is working at Dassu dam project,for allegedly committing blasphemy during his argument with local labourers.
Police arrested the Chinese citizen. pic.twitter.com/JH6IVN6QxT— Jamil Nagri (@jamilnagri) April 16, 2023
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!