NTV Telugu Site icon

China–Russia: రష్యా పర్యటనకు చైనా అధ్యక్షుడు.. జిన్‌పింగ్‌తో పుతిన్‌ కీలక భేటీ..!

China

China

China–Russia: గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రష్యా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్‌ మోర్గులోవ్‌ వెల్లడించారు. అయితే, జిన్‌పింగ్‌ టూర్ లో ప్రాధాన్యతాపరంగా రహస్య మేమీ లేదని చెప్పుకొచ్చారు. ఇక, ఉక్రెయిన్‌పై రష్యా వైఖరిని డ్రాగన్ కంట్రీ అర్థం చేసుకుంది.. అలాగే, అంతర్జాతీయ రంగాలలో రష్యా, చైనాలపై పశ్చిమదేశాలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరు దేశాలు మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందని ఇగోర్‌ మోర్గులోవ్ పేర్కొన్నారు.

Read Also: Congress: మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే నివాళులు

అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వచ్చే ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు మాస్కో రాయబారి ఇగోర్ తెలిపారు. కానీ, కచ్చితమైన తేదీలను మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఈ పర్యటనకు సంబంధించి చైనా విదేశాంగశాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక, మేలో ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ తన మొదటి విదేశీ పర్యటన బీజింగ్‌లోనే చేశారు. ఆ సమయంలో ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌తో పుతిన్‌ భేటీ అయి కీలక చర్చలు జరిపగా.. అందులో కొన్ని రహస్య విషయాలు సైతం ఉన్నాయని పుతిన్‌ చెప్పుకొచ్చారు. కాగా, వ్లాదిమిర్ పుతిన్‌ పర్యటన కంటే ముందు జిన్‌పింగ్‌ రష్యాలో పర్యటించారు.

Show comments