China On Iran War: ఇరాన్‌లో కుట్రల్ని సహించము: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China On Iran War: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. గత శనివారం ఇజ్రాయిల్, యూఎస్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇతర నగరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. మరోవైపు, ఇరాన్ ఇజ్రాయిల్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది.
మరోవైపు, ట్రంప్, నెతన్యాహూలు ఇరాన్‌లో ‘‘పాలన మార్పు’’ కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చైనా నుంచి స్ట్రాంగ్ హెచ్చరిక వచ్చింది. సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన జోక్యాన్ని స్వీకరించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంతర్జాతీయ సమాజానికి ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఇరాన్, మధ్యప్రాచ్యానికి సంబంధించిన సమస్యల్ని సరిగా నిర్వహించాలని అన్నారు. ఇరాన్, గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారం, భద్రతను అన్ని పరిస్థితుల్లో గౌరవించాలని కోరారు. వీలైనంత త్వరగా చర్చలకు రావాలని ఇరు వర్గాలకు సూచించారు.
Also Read
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
Read Also: Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!
“విప్లవం లేదా పాలన మార్పుకు కుట్ర పన్నే ప్రయత్నాలకు ప్రజల మద్దతు లేదు” అని విదేశాంగ మంత్రి అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయాలని చైనా ప్రధాన దేశాలకు సూచించింది. శాంతి కోసం భవిష్యత్తులో చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి చెప్పారు. ప్రాంతీయ భద్రతకు చైనా ఎల్లప్పుడూ ఒక వంతెనగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. చైనా మరియు అమెరికా మధ్య సంభాషణ లేకపోవడం వల్ల అపార్థాలు, మరిన్ని ఘర్షణలు మాత్రమే వస్తాయని ఆయన నొక్కి చెప్పారు. రెండు దేశాల దేశాధినేతలు మంచి సంభాషణను కొనసాగించడానికి కృషి చేశారని, ఈ సంవత్సరం చైనా-అమెరికా సంబంధాలకు ముఖ్యమైన సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. రెండు వైపులా అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని వాంగ్ యి అన్నారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!