Smuggling: చైనాలో ఓ వ్యక్తి 100కి పైగా సజీవ పాములను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు పట్టుబడ్డాడు. అయితే, అతను వీటన్నింటి ప్యాంటులో దాచడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు 104 సజీవంగా ఉన్న పాములను అతని ప్యాంటు జేబుల్లో కనుగోన్నారు. ఎయిర్‌పోర్టు చెక్ పాయింట్ వద్ద కస్టమ్ అధికారులు అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా..ప్యాంటు జేబుల్లో టేప్‌తో సీట్ చేసిన ఆరు కాన్వాస్ డ్రాస్టింగ్ బ్యాగులు కనిపించాయి. వీటిలో పాములను దాచాడు. సెమీ అటానమస్ హాంకాంగ్ నుంచి సరిహద్దు నగరమైన షెన్‌జెన్‌లోకి వీటిని తీసుకువెళ్తున్న క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడని మంగళవారం చైనా కస్టమ్స్ తెలిపింది.
Read Also: Excise Policy Case: కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పాత్ర ప్రస్తావన
మొత్తం ఐదు రకాల పాములను అధికారులు గుర్తించారు. వీటిలో మిల్క్ స్నేక్, వెస్ట్రన్ హాగ్నోస్ స్నేక్, కార్న్ స్నేక్, టెక్సాస్ ర్యాట్ స్నేక్ మరియు బుల్ స్నేక్‌లు ఉన్నాయి. అయితే, ఇవి విషపూరితమైనవి కానప్పటికీ, ఇందులో నాలుగు చైనాలో కనపించే పాములు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద జంతువుల అక్రమ రవాణాకు చైనా కేంద్రంగా ఉంది. అయితే, కొంత కాలంగా అధికారుల ఈ అక్రమ వ్యాపారంపై దాడులు తీవ్రం చేశారు. దేశం యొక్క బయోసెక్యూరిటీ మరియు వ్యాధి నియంత్రణ చట్టాలు అనుమతి లేకుండా స్థానికేతర జాతులను తీసుకురాకుండా నిషేధించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారు, చట్టప్రకారం బాధ్యులవుతారని అధికారులు హెచ్చరించారు.