China: డిఫెన్స్ బడ్జెట్‌ని భారీగా పెంచిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది.
పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సంఖ్యలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్మీగా ఉన్నప్పటికీ.. రక్షణ బడ్జెట్ విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంది. అయినప్పటీకీ, చైనా సైనిక వ్యయం ఇటీవల కాలంలో అమెరికా కన్నా మూడు రెట్లు తక్కువగా ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా తన భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను రక్షించుకోవడానికి రక్షణ బడ్జెట్ పెంచుతుందని ఎన్పీసీ ప్రతినిధి లౌ కిన్జియాన్ సోమవారం తెలిపారు.
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
Read Also: Tamil Nadu: బ్రైడ్ ఆఫ్ తమిళనాడు.. మళ్లీ అభాసుపాలైన స్టాలిన్ సర్కార్
పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలతో చైనా గొడవలు పెట్టుకుంటోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో జపాన్‌తో సహా పలు దేశాల సార్వభౌమాధికారాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఇక భారత్‌తో సరిహద్దు చికాకులు పెట్టడంతో పాటు హిందూ మహాసముద్రంలో మాల్దీవుల వంటి చిన్న దేశాలను అక్కున చేర్చుకుని మన దేశాన్ని చికాకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ప్రకారం, చైనా సైనిక వ్యయం దాని GDPలో 1.6 శాతంగా ఉంది, ఇది యునైటెడ్ స్టేట్స్ లేదా రష్యా కంటే చాలా తక్కువ. ఇక తైవాన్‌ని ఎప్పుడు చేజిక్కించుకుందామనే ఆలోచనలో చైనా ఉంది. ఎన్పీసీ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగానే.. యథావిధిగా తైవాన్ స్వాతంత్ర్యాన్ని, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది.
చైనా రక్షణ పరిణామాలు అమెరికా, నాటో దేశాలకు ప్రమాదకరంగా మారాయి. చైనాను నాటో దేశాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సవాలుగా నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్ బర్గ్ జనవరిలో వ్యాఖ్యానించారు. చైనా గతేడాది అణువార్ హెడ్ల సంక్యను గణనీయంగా పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. సిప్రి ప్రకారం.. బీజింగ్ 2023లో 410 న్యూక్లియర్ వార్‌హెడ్లు ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 60కి పెరిగాయి. అయినప్పటీకీ అమెరికా వద్ద 3708, రష్యా వద్ద 4489 కంటే తక్కువనే చెప్పాలి. రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే ఇప్పటికే అమెరికానే టాప్‌లో ఉంది. తర్వాత స్థానాల్లో చైనా, రష్యా, భారత్ ఉన్నాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?