China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ (AI) సాంకేతికతల భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. అత్యాధునిక AI టెక్నాలజీలు, సెమీకండక్టర్ చిప్ డిజైన్లు, సంబంధిత సాంకేతికతల ఎగుమతిపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చైనా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ టెక్నాలజీలపై కఠిన నియంత్రణకు చైనా సిద్ధం
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. చైనా ప్రభుత్వం దేశంలోని ప్రముఖ AI కంపెనీలైన అలీబాబా, బైట్‌డాన్స్, జిపు తదితర సంస్థలతో చర్చలు జరుపుతోంది. అత్యాధునిక AI మోడళ్లను వ్యూహాత్మక జాతీయ ఆస్తిగా పరిగణిస్తూ, వాటి సాంకేతికత దేశం వెలుపలకు వెళ్లకుండా పరిమితులు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శిక్షణ (Training) డేటాను విదేశాలకు బదిలీ చేయడంపై నియంత్రణలు, విదేశీ వినియోగదారులు AI మోడళ్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాలపై పరిమితులు వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా చైనా అభివృద్ధి చేసిన సాంకేతికత ఇతర దేశాలకు సులభంగా చేరకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ఈ నివేదికలు పేర్కొంటున్నాయి.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
క్వాల్కామ్, టీఎస్ఎంసీ వంటి విదేశీ చిప్ తయారీ సంస్థలు చైనా రూపొందించిన డిజైన్ల ఆధారంగా ఉత్పత్తి చేయకుండా కొత్త మార్గదర్శకాలు తీసుకురావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. చైనా తన సెమీకండక్టర్ డిజైన్లపై పూర్తి నియంత్రణ కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం AI, సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగుమతిపై ఎలాంటి అధికారిక నిషేధం ప్రకటించలేదు. అయితే, ఎగుమతి నియంత్రణ జాబితాలో ఈ టెక్నాలజీలను చేర్చే అవకాశాన్ని చైనా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తే రక్షణ, ఆటోమొబైల్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, AI పరిశ్రమలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే అత్యాధునిక సెమీకండక్టర్ తయారీలో ప్రస్తుతం తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా ముందంజలో ఉండగా, చైనా ప్రధానంగా చిప్ ప్యాకేజింగ్, కొన్ని ప్రత్యేక విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే చైనా హీలియం ఎగుమతులపై పరిమితులు విధించిన నేపథ్యంలో, ఇప్పుడు AI, చిప్ టెక్నాలజీలపై కూడా కఠిన నిబంధనలు తీసుకురావచ్చనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడితే ప్రపంచ టెక్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!