Site icon NTV Telugu

India-US: 48 గంటల్లో భారత్-యూఎస్ మధ్య కీలక డీల్ జరిగే ఛాన్స్!

Usindia

Usindia

భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 48 గంటల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరిగాయి. అంతేకాకుండా భారత్‌తో భారీ ఒప్పందం జరగబోతుందని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఇక సుంకాలపై ట్రంప్ విధించిన తాత్కాలిక వాయిదా గడువు జూలై 9తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరకొన్ని గంటల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద ప్రకటన రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Success Story: ఇది కదా సక్సెస్ అంటె.. 14 ఏళ్ల వయసులో బడికి.. 35 ఏళ్లకే పీహెచ్‌డీ పూర్తి.. హేట్స్ ఆఫ్ బాసు

ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగొచ్చని అంతా భావిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే మాత్రం పరస్పర సుంకాల రేటు 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. అమెరికా ప్రతిపాదనలు.. భారతీయ రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు భారత్ అంగీకరించడం లేదని సమాచారం. వ్యవసాయం, పాడి రంగాలకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కోసం అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రతపై భయాందోళనలు తల్తెతే అవకాశం ఉంది. భారత్ అందుకు అంగీకరిచడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా ముగుస్తాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏమవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదలకు డేట్ ఫిక్స్.. వారికి కూడా!

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించారు. దీంతో ఆయా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరికి వెనక్కి తగ్గిన ట్రంప్.. 90 రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది. ఒకవేళ ఒప్పందం జరగకపోతే మాత్రం సుంకాలు 27 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version