Canada Supreme Court Judgement Removing Condom Without Partner Consent Is Crime: అది 2017.. కెనడాకు చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌లో రాస్ కిర్క్‌పాట్రిక్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్‌లో కొన్నిరోజుల పాటు చాటింగ్ చేసుకున్న ఈ ఇద్దరు, కలవాలని అనుకున్నారు. రెండు, మూడు సార్లు కలిసిన తర్వాత.. శృంగారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే.. శృంగారం సమయంలో కండోమ్ ధరించాల్సిందేనని ఆ యువతి పట్టుబట్టింది. అందుకు ఆ యువకుడు సరేనన్నాడు. మొదట్లో కండోమ్ ధరించి, ఆ తర్వాత తీసేశాడు.
కట్ చేస్తే.. కొద్దిరోజుల తర్వాత కిర్క్‌పాట్రిక్ కండోమ్ లేకుండానే తనతో శృంగారంలో పాల్గొన్నాడన్న విషయం ఆ యువతికి తెలిసింది. దాంతో ఆ యువతి కోపం నషాళానికి ఎక్కింది. తొలుత ముందు జాగ్రత్తగా హెచ్‌ఐవీ సోకకుండా ఉండేందుకు చికిత్స చేయించుకున్న ఆ యువతి, ఆ తర్వాత కిర్క్‌పాట్రిక్‌ని కోర్టుకు ఈడ్చింది. లైంగిక వేధింపుల కేసు వేసింది. మొదట్లో ఈ కేసుని ట్రయల్ కోర్టు కొట్టేసింది. కానీ.. ఓటమిని అంగీకరించని ఆ అమ్మాయి, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుని విచారించిన అత్యున్నత న్యాయ స్థానం.. అమ్మాయికి అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చింది.
ఇష్టపూర్వకంగా పార్ట్‌నర్స్ శృంగారంలో పాల్గొన్నప్పటికీ, పార్ట్‌నర్‌కి తెలియకుండా కండోమ్ తొలగించి శృంగారంలో పాల్గొనడం అత్యాచార నేరంగానే పరిగణిస్తామని కోర్టు పేర్కొంంది. కండోమ్ లేకుండా చేసే శృంగారం, కండోమ్‌తో పాల్గొనే శృంగారం.. రెండూ విభిన్నమైనవని కోర్టు ఖరారు చేసింది. శృంగారంలో పాల్గొనడంలోనే కాదు, కండోమ్ విషయంలోనూ ఇరువురి సమ్మతి అవసరమేనంటూ కోర్టు తేల్చింది. ఈ విషయంలో కిర్క్‌పాట్రిక్ ‘ట్రయల్’ను ఎదుర్కోవలసి ఉంటుందని కోర్టు పేర్కొంది. అక్కడ వచ్చే జడ్జిమెంట్ ఆధారంగా అతనికి శిక్ష వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.