Canada Cops Beating Hindus: కెనడాలోని గుడిలో హిందువులను కొట్టిన పోలీసులు
- కెనడాలో హిందూ సమాజంపై కొనసాగుతున్న దాడులు..
- హిందూ భక్తులపై దాడి చేసిన ఖలిస్తానీ మద్దతుదారులు..
- పోలీసులు హిందువులపై దాడి చేసి.. ఖలిస్తానీలకు రక్షణ కల్పించారని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada Cops Beating Hindus: కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడి చేసిన తర్వాత తీవ్ర గందరగోళం ఏర్పాడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, దాడికి గురైన వారు ఆలయంలో నిరసనకు దిగడంతో వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Read Also: Indonesia Volcano Erupts: భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం.. తొమ్మిది మంది మృతి
Also Read
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
అయితే, ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందూ సమాజానికి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన వారిని లాఠీలతో కొట్టడం కింది వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోలో ఒక మహిళ గడ్డం ఉన్న పోలీస్ అధికారి దాడి చేసినట్లు తెలిపింది. ఖలిస్తానీ నిరసనకారులను రక్షించేటప్పుడు కేవలం హిందూ సమాజ సభ్యులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు దాడి చేశారని విమర్శించింది.
Read Also: Canada: కెనడాలో హిందువుల భద్రతపై ఇండియన్ మిషన్ ఆందోళన
ఈ ఘటనపై భారతీయ సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు హద్దులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో తెలిపారు. హిందూ భక్తులపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు అనేక దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
BREAKING: The RCMP start attacking Hindu worshippers on their own temple grounds in Surrey BC.
Watch as an RCMP officer goes into the crowd to go after Hindu devotees after pushing them back to protect the Khalistanis who came to harass the temple goers on Diwali. Punching Hindus… pic.twitter.com/uugAJun59q— Daniel Bordman (@DanielBordmanOG) November 4, 2024
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!