NTV Telugu Site icon

Canada Cops Beating Hindus: కెనడాలోని గుడిలో హిందువులను కొట్టిన పోలీసులు

Canada Cop

Canada Cop

Canada Cops Beating Hindus: కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడి చేసిన తర్వాత తీవ్ర గందరగోళం ఏర్పాడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, దాడికి గురైన వారు ఆలయంలో నిరసనకు దిగడంతో వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న వారిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

Read Also: Indonesia Volcano Erupts: భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం.. తొమ్మిది మంది మృతి

అయితే, ఖలిస్తానీ మద్దతుదారులు.. హిందూ సమాజానికి చెందిన సభ్యుల మధ్య వాగ్వాదం జరిగిన తరువాత పరిస్థితి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వచ్చిన పోలీసులు హిందూ వర్గానికి చెందిన వారిని లాఠీలతో కొట్టడం కింది వీడియోలో కనిపిస్తుంది. ఆ వీడియోలో ఒక మహిళ గడ్డం ఉన్న పోలీస్ అధికారి దాడి చేసినట్లు తెలిపింది. ఖలిస్తానీ నిరసనకారులను రక్షించేటప్పుడు కేవలం హిందూ సమాజ సభ్యులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు దాడి చేశారని విమర్శించింది.

Read Also: Canada: కెనడాలో హిందువుల భద్రతపై ఇండియన్ మిషన్ ఆందోళన

ఈ ఘటనపై భారతీయ సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు హద్దులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో తెలిపారు. హిందూ భక్తులపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు అనేక దుశ్చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

Show comments