British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్‌లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్ (BA) ఐటీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. శుక్రవారం వరసగా రెండో రోజు డజన్ల కొద్దీ విమానాలను రద్దు చేసింది. ‘‘సాంకేతిక సమస్య నాక్ ఆన్ ఎఫెక్ట్’’ కారణంగా శుక్రవారం 42 విమానాలు రద్దయ్యాయి. రద్దు కారణంగా 16,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. గురువారం అత్యంత బిజీగా ఉంటే లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టు నుంచి 80 విమానాలు ఆలస్యం కావడం లేదా రద్దవ్వడం జరిగింది. విమానాల్లో ఎక్కువ భాగం నడుస్తున్నప్పటికీ.. నాక్-ఆన్ ఎఫెక్ట్ వల్ల స్వల్పదూరాల విమానాలను రద్దు చేస్తున్నట్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రకటించింది.
Read Also: UPSC Exam: సివిల్స్‌లో “ఇద్దరికి ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్” కేసు.. క్రిమినల్ చర్యలకు సిద్ధం..
Also Read
- Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Khawaja Asif: 'మధ్యవర్తి' నుంచి 'గారడీవాడి' స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
ప్రయాణికులకు వేరే విమానాల్లో రీబుకింగ్ చేయడం లేదా, డబ్బులను రీఫండ్ చేస్తున్నట్లు ఎయిర్ వేస్ తెలిపింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు విమాన స్టేటస్ తెలుసుకోవాలని కోరింది. గురువారం విమానాలను రద్దు చేసిన తర్వాత సదరు సంస్థ ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఈ వీకెండ్ లో యూకే విమానాశ్రయం నుంచి 11,300 కన్నా ఎక్కువ విమానాలు బయలుదేరాల్సి ఉందని, డేటా సంస్థ సిరియమ్ వెల్లడించింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ గతంలో కూడా ఐటీ ఫెయిల్యూర్ సమస్యను ఎదుర్కొంది. 2017లో వీకెండ్ సమయంలో 75,000 మంది ప్రయాణికులు ఇదే విధంగా ప్రభావితమయ్యారు. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు యూరప్ వ్యాప్తంగా ప్రయాణించే క్రమంలో ఈ అవాంతరం ఎదురైంది. ఒక ఏడాది తర్వాత ఎయిర్ లైన్ బుకింగ్స్, ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇలాంటి సమయాల్లో నాక్ ఆన్ ఎఫెక్ట్ అనే టెక్నికల్ సమస్య ఏర్పడుతుంది.
తాజావార్తలు
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..