Donald Trump: “జన్మహక్కు పౌరసత్వం” అర్హత లేని వ్యక్తులకు, అర్హత లేని పిల్లలకు కాదు..
- జన్మహక్కు పౌరసత్వ బానిసల పిల్లల కోసమే..
- అర్హత లేని వారికి, అర్హత లేని పిల్లలకు కాదు..
- తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ జెట్ వేగంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా తాను ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో, వాటిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు విడుదల చేశారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించడం, వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచడం, జన్మహక్కు(బర్త్ రైట్) పౌరసత్వాలను నిషేధిస్తూ ఆర్డర్లపై సంతకాలు చేశారు.
తాజాగా జన్మహక్కు పౌరసత్వంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. జన్మహక్కు పౌరసత్వం ‘‘బానిసల పిల్లలకు ఉద్దేశించబడింది’’ అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ తరహా సిటిజన్‌షిప్ మొదటగా బానిసల పిల్లలకు ప్రయోజనం కోసం ఉద్దేశించబడిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు యూఎస్ పౌరసత్వం పొందేందుకు కాదని చెప్పారు. ప్రతీ ఒక్కరు అమెరికా వస్తారు, అర్హత లేని వ్యక్తులు, అర్హత లేని పిల్లలకు ఈ జన్మహక్కు పౌరసత్వం ఉద్దేశించబడలేదని చెప్పారు. ప్రపంచం మొత్తం అమెరికాని ఆక్రమిస్తానని చూస్తే చూస్తూ ఊరుకోనని ట్రంప్ చెప్పారు.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
Read Also: Rashtrapati Bhavan: సోనియాగాంధీ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్రపతి భవన్
బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే, జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే లక్ష్యంతో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు, అయితే దానిని సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు త్వరగా కొట్టివేసింది. సుప్రీం కోర్టు చివరికి తనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ సెనేటర్లు లిండ్సే గ్రాహం, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్ ట్రంప్ అభిప్రాయాలకు అనుగుణంగా ఉండే బిల్లును ప్రవేశపెట్టారు. 2025 జన్మహక్కు పౌరసత్వ చట్టం పేరుతో ప్రతిపాదించిన చట్టం, అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాలపై వలసదారులు కాని వారికి జన్మించిన పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లాడికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో ఒక్కరైనా అమెరికన్ జాతీయుడైనా లేదా, చట్టబద్ధమైన శాశ్వత నివాసి లేదా అమెరికా సైన్యంలో పనిచేసి ఉండాలని నిబంధనలు పెట్టారు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?