NTV Telugu Site icon

Bill Gates is in love: లేటు వయసులో ఘాటు ప్రేమలో బిల్‌గేట్స్‌..! ఆమె ఎవరో తెలుసా..?

Bill Gates

Bill Gates

Bill Gates is in love: బిల్‌గేట్స్‌ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఒరాకిల్‌ మాజీ సీఈవో, దివంగత మార్క్‌ హర్డ్‌ సతీమణి పాలా హర్డ్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్‌… ఏడాది నుంచి పాలా హర్డ్‌తో డేటింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. ఆరు పదుల వయసున్న ఈ జంట ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొని డేటింగ్ వార్తలకు బలం చేకూర్చింది. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడైన బిల్‌గేట్స్‌ వయస్సు 67 ఏళ్లు.. 2021లో ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌తో విడాకులు తీసుకున్నారు. ఇక, పాలా హర్డ్‌ వయస్సు 60 ఏళ్లు. ఆమె భర్త 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌ కారణంగా మరణించారు. పాలా హర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు. బిల్‌గేట్స్‌, మెలిందా డేటింగ్‌ను వారి స్నేహితులు కూడా ధృవీకరిస్తున్నారు.

Read Also: Air India: ఎయిర్‌బస్‌తో ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కోసం ఒప్పందం..?

ఇక, బిల్‌గేట్స్‌, పౌలా హర్డ్‌ గత ఏడాది కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి.. గత నెలలో ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు.. దీంతో, బిల్‌ గేట్స్‌-పౌలా రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. వారిది విడదీయలేని బంధం అంటూ.. వారికి సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు.. అయితే, మార్క్‌ మరణించిన తర్వాత పాలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.. ఇదే సమయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు.. దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు బిల్‌ గేట్స్‌-మెలిందా దంపతులు. వీరికి 1994లో మ్యారేజ్‌ జరగగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, పెళ్లైన 27 ఏళ్ల తర్వాత అనూహంగా విడిపోయారు.. ఆ తర్వాత మరో లవ్‌ ట్రాక్‌ ఎక్కారు బిల్‌గేట్స్‌.

Show comments