Site icon NTV Telugu

Hafiz Saeed: ‘‘హఫీజ్ సయీద్‌ని భారత్‌కి అప్పగిస్తాం’’.. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఉగ్రవాది ఆగ్రహం..

Bilawal Bhutto Said Masood Azhar Was Not In Pakistan While Admit

Bilawal Bhutto Said Masood Azhar Was Not In Pakistan While Admit

Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఉగ్రవాది మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్తాన్‌కు అభ్యంతరం లేదని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే, బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు, ఉగ్రవాది తల్హ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భుట్టో్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌కు అవమానం తెచ్చిపెట్టేలా ఉన్నాయని అన్నారు.

శుక్రవారం అల్ జజీరాకు ఇచ్చని ఇంటర్వ్యూలో భుట్టో మాట్లాడుతూ.. న్యూఢిల్లీ నుంచి సహకారం ఉంటే పాకిస్తాన్ కొందరు ఆందోళన కలిగించే వ్యక్తులను పాకిస్తాన్‌కు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: CJI BR Gavai: ‘‘మరాఠీ’’ మీడియంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..

26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్, ప్రస్తుతం ఉగ్రవాద నిధులు సమకూర్చినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతడి కోసం పాక్ ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తోంది. మరో ఉగ్రవాది మసూద్ అజార్‌ని ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టుగా గుర్తించింది. భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన మసూద్ అజార్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన దాడులతో సంబంధం కలిగి ఉన్నాడు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 కాందహార్ హైజాక్ బందీల మార్పిడిలో భాగంగా ఇతడిని భారత్ అప్పగించింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం హఫీజ్ సయీద్ జైలులో ఉన్నారని, మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో తెలియని, బహుశా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండొచ్చని బిలావల్ భుట్టో అన్నారు. పాకిస్తాన్‌లో ఉన్నాడని భారత్ చెబుతున్న సమాచారాన్ని ఆయన తోపిపుచ్చారు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్హ సయీద్‌ అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు.

Exit mobile version