NTV Telugu Site icon

Mark Zuckerberg: జో బైడెన్ సర్కార్ మోటాపై తీవ్ర ఒత్తిడి చేశారు..

Meta

Meta

Mark Zuckerberg: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార డెమోక్రటిక్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్‌.. ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ పరిణామాల మధ్య మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ హాట్ కామెంట్స్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సారథ్యంలోని ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.

Read Also: Khammam Thieves: ఖమ్మంలో దొంగలు హల్‌చల్‌.. గ్రామస్తులు వెంటబడటంతో బట్టలు విప్పి పరార్‌

కాగా, కోవిడ్‌కు సంబంధించిన పోస్ట్‌లను సెన్సార్ చేయాలంటూ మెటా/ఫేస్‌బుక్‌పై అనేక సార్లు అధ్యక్షుడు జో బైడెన్ ఒత్తిడి చేశారని జుకర్ బర్గ్ ఆరోపించారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీకి రెండు పేజీల లేఖ రాశారు. ఇక, ఈ లేఖను జ్యుడీషియరీ కమిటీ తన అధికారిక ఎక్స్ ( ట్విట్టర్ ) అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇందులో పలు కీలక అంశాలను అతడు ప్రస్తావించారు. జో బైడెన్- కమలా హారిస్ సర్కార్ అమెరికన్ల కోవిడ్ సమాచారాన్ని సెన్సార్ చేయమని ఫేస్‌బుక్‌పై తీవ్ర ఒత్తిడి చేశారు.. అలాగే, బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వివాదాస్పద ల్యాప్‌టాప్ వార్తలను కూడా పోస్ట్ కాకుండా అడ్డుకుందని మార్క్ జుకర్ బర్గ్ చెప్పుకొచ్చారు.

Read Also: Shikhar Dhawan: గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న శిఖర్ ధావన్.. కాకపోతే.?

అయితే, 2021లో వైట్ హౌస్‌ సీనియర్ అధికారుల నుంచి తనకు లేఖలు అందాయని మోటా చీప్ మార్క్ జుకర్ బర్గ్ వివరించారు. కోవిడ్‌పై సెటైరికల్ కామెంట్స్ మొదలుకుని ఎలాంటి కంటెంట్‌ అయినా సరే.. దాన్ని పోస్ట్ చేయాలంటూ ఇబ్బంది పెట్టారని స్పష్టం చేశాడు. స్వేచ్ఛగా అభిప్రాయాలను తెలిపల్సిన ఓ బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నారు. తనకు వైట్ హౌస్ అధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడే ఈ విషయాన్ని బయట పెట్టకపోయినందుకు చింతిస్తున్నానని జుకర్‌బర్గ్ ఈ లేఖలో వెల్లడించారు.