Site icon NTV Telugu

Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం.. కొడుకు పెళ్లి వాయిదా వేసిన ప్రధాని..

Israel Iran

Israel Iran

Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఎలిమినేట్ చేసింది. ఇదే కాకుండా ఇరన్ అణు శాస్త్రవేత్తలను చంపేసింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు, ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయిల్ టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా నగరాలే లక్ష్యంగా వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది.

Read Also: Yanamala Rama Krishnudu: గతంలో నిద్రపోయారా..? సోకాల్డ్ సంపాదకులపై యనమల ఫైర్..!

రెండు దేశాల మధ్య ఘర్షణ తీవ్రంగా మారడం, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తన కుమారుడి పెళ్లిని వాయిదా వేస్తుకున్నారు. నెతన్యాహూ కుమారుడు అవ్నర్ నెతన్యాహూ సోమవారం తన భాగస్వామి అమిత్ యార్దేనిని వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, ఇజ్రాయిల్ బందీలు ఇప్పటికీ గాజాలో ఉండగా, నెతన్యాహూ కుటుంబం వేడుకలు జరుపుకోవడంపై కొందరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ వివాహం వివాదానికి దారి తీసింది. టెల్ అవీవ్‌కు ఉత్తరాన ఉన్న కిబ్బట్జ్ యాకుమ్‌లోని ఉన్నత స్థాయి రోనిట్స్ ఫామ్ ఈవెంట్ హాల్‌లో వివాహ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారని ముందుగా అనుకున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే కుమారుడి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, నెతన్యాహు కుటుంబం మెగా వేడుకలకు సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది, అణు స్థావరాలు, సైనిక సౌకర్యాలు, క్షిపణి స్థావరాలు మరియు ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతీకారంగా జరిపిన దాడుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు మరణించారని, 180 మంది గాయపడ్డారని ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు.

Exit mobile version