NTV Telugu Site icon

Bangladesh: ‘‘అత్యాచారాలు చేసిన పాకిస్తాన్‌ని ఏం అనవద్దు’’.. రేడియో, టీవీ కంటెంట్‌పై బంగ్లా నిషేధం..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది. ఇక జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీం, బీఎన్పీ వంటి మతోన్మాద సంస్థల చేతుల్లో కీలు బొమ్మగా మారాడు.

యూనస్ ప్రభుత్వం ప్రో-పాకిస్తాన్ విధానాన్ని అవలంబిస్తోంది. 1970లలో బంగ్లాదేశ్ ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ సాగించిన దురాగతాలను, అత్యాచారాలను మరిచిపోయి రెండు దేశాలు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూ, భారత వ్యతిరేక విధానాలను పాటిస్తున్నాయి. పాకిస్తాన్‌ని చిన్న మాట కూడా అనకుండా బంగ్లాదేశ్ చర్యలు తీసుకుంటోంది.

Read Also: Raghunandan Rao: కులగణన గురించి గొప్పగా చెప్పుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీని సీఎం చేయండి

తాజాగా, బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వ రేడియో బంగ్లాదేశ్ బేతార్‌కి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ బెంగాలీలపై సాగించిన మారణహోమాన్ని ఖండించే పాటల్ని లేదా కంటెంట్‌ని ప్రసారం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో పాకిస్తాన్ 3 మిలియన్ల మంది బంగ్లాదేశీయుల్ని చంపింది. లక్షలాది మహిళలు, బాలికలప అత్యాచారాలు చేసింది. ఇప్పుడు ఈ విషయాలను ప్రభుత్వ రేడియోల్లో, టీవీల్లో ప్రస్తావించకుండా నిషేధం విధించింది. బెంగాలీల మారణహోమానికి పాకిస్తాన్‌ని జవాబుదారీగా ఉంచలేమని యూనస్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇదే కాకుండా, మహ్మద్ అలీ జిన్నా, జుల్ఫికర్ అలీ భుట్టో, అయూబ్ ఖాన్, టిక్కా ఖాన్ వంటి పాకిస్తాన్ మాజీ నాయకులపై వ్యాఖ్యలు చేయకుండా నిషేధించబడ్డాయి. బంగ్లాదేశీయుల్ని అణిచివేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వీరే ప్రముఖులు.