Bangladesh: ‘‘అత్యాచారాలు చేసిన పాకిస్తాన్‌ని ఏం అనవద్దు’’.. రేడియో, టీవీ కంటెంట్‌పై బంగ్లా నిషేధం..
- పాకిస్తాన్‌పై అతిప్రేమ చూపిస్తున్న బంగ్లాదేశ్..
- ఆ దేశాన్ని విమర్శించకుండా రేడియో, టీవీలకు ఆదేశం..
- ప్రో-పాకిస్తాన్ విధానాన్ని అవలంభిస్తున్న మహ్మద్ యూనస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆ దేశంలో అధికారం చేపట్టినప్పటి నుంచి పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ చెలరేగిపోతున్నారు. యూనస్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల్ని, అరాచకవాదుల్ని విడుదల చేసింది. ఇక జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీం, బీఎన్పీ వంటి మతోన్మాద సంస్థల చేతుల్లో కీలు బొమ్మగా మారాడు.
యూనస్ ప్రభుత్వం ప్రో-పాకిస్తాన్ విధానాన్ని అవలంబిస్తోంది. 1970లలో బంగ్లాదేశ్ ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ సాగించిన దురాగతాలను, అత్యాచారాలను మరిచిపోయి రెండు దేశాలు స్నేహాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూ, భారత వ్యతిరేక విధానాలను పాటిస్తున్నాయి. పాకిస్తాన్‌ని చిన్న మాట కూడా అనకుండా బంగ్లాదేశ్ చర్యలు తీసుకుంటోంది.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
Read Also: Raghunandan Rao: కులగణన గురించి గొప్పగా చెప్పుకునే రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీని సీఎం చేయండి
తాజాగా, బంగ్లాదేశ్ చీఫ్ మహ్మద్ యూనస్ ప్రభుత్వ రేడియో బంగ్లాదేశ్ బేతార్కి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ బెంగాలీలపై సాగించిన మారణహోమాన్ని ఖండించే పాటల్ని లేదా కంటెంట్‌ని ప్రసారం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాట సమయంలో పాకిస్తాన్ 3 మిలియన్ల మంది బంగ్లాదేశీయుల్ని చంపింది. లక్షలాది మహిళలు, బాలికలప అత్యాచారాలు చేసింది. ఇప్పుడు ఈ విషయాలను ప్రభుత్వ రేడియోల్లో, టీవీల్లో ప్రస్తావించకుండా నిషేధం విధించింది. బెంగాలీల మారణహోమానికి పాకిస్తాన్‌ని జవాబుదారీగా ఉంచలేమని యూనస్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇదే కాకుండా, మహ్మద్ అలీ జిన్నా, జుల్ఫికర్ అలీ భుట్టో, అయూబ్ ఖాన్, టిక్కా ఖాన్ వంటి పాకిస్తాన్ మాజీ నాయకులపై వ్యాఖ్యలు చేయకుండా నిషేధించబడ్డాయి. బంగ్లాదేశీయుల్ని అణిచివేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో వీరే ప్రముఖులు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!