Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- గంగా నదిపైనే భారత్ సంబంధాలు ఆధారపడుతాయి..
- బంగ్లాదేశ్ అధికార పార్టీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేకతను పెంచిపోషించింది. ఇప్పుడు, ప్రధాని తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కూడా వివాదాలను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేస్తోంది. భారత్‌తో భవిష్యత్ సంబంధాలు ‘‘గంగా జలాల పంపిణీ ఒప్పందం’’పై ఆధారపడుతాయని బీఎన్పీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఒప్పందంపై వెంటనే చర్చలు ప్రారంభించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరింది.
బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి, సహకార శాఖ మంత్రి, బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలమ్గీర్ మాట్లాడుతూ..బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త గంగా జలాల ఒప్పందం కుదిరితే భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. 1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కాలంలో కుదిరిన ఒప్పందం 2026తో ముగుస్తోంది.
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లే గంగా నది( బంగ్లాదేశ్‌లో పద్మా నదిగా పిలుస్తారు), ఆ దేశ వ్యవసాయం, తాగునీటి అవసరాలకు కీలకం. ఒక్క గంగా నది మాత్రమే కాకుండా, 50కి పైగా నదులు భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఫరక్కా బ్యారేజ్ కీలకంగా మారింది. కోల్‌కతా పోర్ట్ నావిగేషన్ కోసమే తాము ఫరక్కా డ్యామ్ నిర్మించినట్లు భారత్ చెబుతోంది. ఈ డ్యామ్ వల్ల వేసవి కాలంలో నదీ ప్రవాహం తగ్గి నీరు ఉప్పుగా మారడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని బంగ్లా ఆరోపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఫరక్కా ప్రభావాన్ని తగ్గించడానికి పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణానికి బంగ్లాదేశ్ ఇటీవల ఆమోదం తెలిపింది. 2033 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య తీస్తా నది వివాదం కూడా ఉంది. మమతా బెనర్జీ తీస్తా నది విసయంలో సహకరించలేదని ఇటీవల బీఎన్పీ ఆరోపించింది. తీస్తా ఒప్పదం అమలైతే భారత్-బంగ్లా మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ఆ పార్టీ చెప్పింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..