Pakistan: పాకిస్తాన్లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం
- పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి..
- జాఫర్ ఎక్స్‌ప్రెస్ టార్గెట్‌గా బీఎల్ఏ అటాక్..
- 23 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు టార్గెట్‌గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడికి పాల్పడింది. బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 23 మంది మరణించగా, 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో రైలు బోగీ పూర్తిగా ధ్వంసమైంది. పట్టాల వెండి ఉన్న అనేక ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
చమన్ గేట్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దాడి జరిగింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి సైనిక సిబ్బందిని తీసుకెళ్తున్న సమయంలో దాడి జరిగింది. మరణించిన వారిలో పాక్ ఆర్మీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు, అధికారులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
గతంలో కూడా ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ టార్గెట్‌గా బలూచ్ వీరులు దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఈ రైలునే హైజాక్ చేసి, పాక్ ఆర్మీ అధికారుల్ని ఊచకోత కోశారు. క్వెట్టా నుంచి పెషావర్ ప్రయాణించే ఈ రైలులో చాలా మంది ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తుంటారు. దీంతో చాలా సార్లు బీఎల్ఏ ఈ రైలును టార్గెట్ చేస్తోంది. తాజాగా జరిగిన సంఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!