NTV Telugu Site icon

US Air Force: ఇజ్రాయెల్కు చేరుకున్న యూఎస్ భారీ యుద్ధ విమానాలు

Us Air Force

Us Air Force

US Air Force: అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు B-52 స్ట్రాటోఫొర్ట్రెస్‌లు ఇజ్రాయెల్ కు చేరుకున్నాయి. యూఎస్ సైన్యానికి చెందిన సెంట్రల్‌ కమాండ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు తాము ఈ విమానాలను అందిస్తున్నట్లు అగ్రరాజ్యం హెచ్చరించిన కేవలం 24 గంటల్లోనే ఇవి గల్ఫ్‌ ప్రాంతానికి చేరుకున్నాయి. మినాటో ఎయిర్‌ బేస్‌లోని 5వ బాంబ్‌ వింగ్‌కు చెందిన బీ-52 స్ట్రాటజిక్‌ బాంబర్లు ఇప్పుడే సెంట్రల్‌ కమాండ్‌ ఏరియాకు చేరుకున్నాయిని సెంట్‌ కామ్‌ ఎక్స్‌ (ట్విట్టర్) లో తెలిపింది. వీటితో పాటు ఫైటర్‌ జెట్లు, ట్యాంకర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్‌ మిసైల్స్‌ కూడా పంపినట్లు పేర్కొనింది. ఈ సందర్భంగా పెంటగాన్‌ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ పాట్‌ రైడర్‌ మాట్లాడుతూ.. ఇరాన్‌, దాని మద్దతున్న సంస్థలు యూఎస్ సైన్యం లేదా మా దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అడ్డుకుని మా వారిని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also: Iran : ఇరాన్ లోని యూనివర్సిటీలో డ్రస్ కోడ్ కు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ

కాగా, అమెరికా బాంబర్లను తరలిస్తున్న విషయం తెలియగానే ఇరాన్‌ తీవ్రంగా మండిపడింది. అగ్రరాజ్యానికి గట్టి సమాధానం చెబుతామని ఆ దేశ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తాము అణు విధానాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని ఖమేనీ సలహాదారు కమాల్‌ ఖర్రాజ్‌ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ కమాండోలు లెబనాన్‌లో పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. లెబనాన్‌ తీరంలో ఓ హెజ్‌బొల్లా సీనియర్‌ ఆపరేటివ్‌ను తమ అదీనంలోకి తీసుకున్నారు. ఈ దాడులను లెబనాన్‌ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. దీనిపై లెబనాన్‌ సైన్యం, ఐరాస శాంతి పరిరక్షక దళం విచారణ ప్రారంభించింది.

Show comments