US Air Force: ఇజ్రాయెల్కు చేరుకున్న యూఎస్ భారీ యుద్ధ విమానాలు
- ఇజ్రాయెల్కు చేరుకున్న అమెరికాకు చేరుకున్న యుద్ధ విమానాలు..
- సెంట్రల్ కమాండ్ ఏరియాకు B-52 స్ట్రాటోఫొర్ట్రెస్‌లు చేరుకున్నట్లు వెల్లడి..
- మా దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని ఇరాన్ చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు: అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Air Force: అమెరికాకు చెందిన భారీ యుద్ధ విమానాలు B-52 స్ట్రాటోఫొర్ట్రెస్‌లు ఇజ్రాయెల్ కు చేరుకున్నాయి. యూఎస్ సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు తాము ఈ విమానాలను అందిస్తున్నట్లు అగ్రరాజ్యం హెచ్చరించిన కేవలం 24 గంటల్లోనే ఇవి గల్ఫ్ ప్రాంతానికి చేరుకున్నాయి. మినాటో ఎయిర్ బేస్‌లోని 5వ బాంబ్ వింగ్‌కు చెందిన బీ-52 స్ట్రాటజిక్ బాంబర్లు ఇప్పుడే సెంట్రల్ కమాండ్ ఏరియాకు చేరుకున్నాయిని సెంట్ కామ్ ఎక్స్ (ట్విట్టర్) లో తెలిపింది. వీటితో పాటు ఫైటర్ జెట్లు, ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, బాలిస్టిక్ మిసైల్స్ కూడా పంపినట్లు పేర్కొనింది. ఈ సందర్భంగా పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ.. ఇరాన్, దాని మద్దతున్న సంస్థలు యూఎస్ సైన్యం లేదా మా దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే అడ్డుకుని మా వారిని కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: Iran : ఇరాన్ లోని యూనివర్సిటీలో డ్రస్ కోడ్ కు వ్యతిరేకంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ
Also Read
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్‌ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
కాగా, అమెరికా బాంబర్లను తరలిస్తున్న విషయం తెలియగానే ఇరాన్ తీవ్రంగా మండిపడింది. అగ్రరాజ్యానికి గట్టి సమాధానం చెబుతామని ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. తాము అణు విధానాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని ఖమేనీ సలహాదారు కమాల్ ఖర్రాజ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ కమాండోలు లెబనాన్‌లో పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. లెబనాన్ తీరంలో ఓ హెజ్‌బొల్లా సీనియర్ ఆపరేటివ్‌ను తమ అదీనంలోకి తీసుకున్నారు. ఈ దాడులను లెబనాన్ తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. దీనిపై లెబనాన్ సైన్యం, ఐరాస శాంతి పరిరక్షక దళం విచారణ ప్రారంభించింది.
B-52 Stratofortress strategic bombers from Minot Air Force Base's 5th Bomb Wing arrived in the U.S. Central Command area of responsibility. pic.twitter.com/6mDs4n5G2u
— U.S. Central Command (@CENTCOM) November 2, 2024
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్‌లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!