Site icon NTV Telugu

US-Israel: ఖతార్‌లో దాడి విషయం అమెరికాకు ముందే తెలుసా! వెలుగులోకి కీలక రిపోర్ట్!

Trump1

Trump1

ఖతార్‌లో హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం మెరుపు వేగంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడింది. దోహాలో నివాస సముదాయాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే హమాస్ అగ్ర నాయకులంతా తప్పించుకోగా.. బంధువులు, ఒక ఖతార్ అధికారి మాత్రం బలైపోయారు. అయితే ఈ దాడి అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తీరును ఖండించాయి. ఖతార్‌కు మద్దతుగా నిలిచాయి.

ఇక ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి విషయం తనకు తెలియదని.. దీని వెనుక తన ఆదేశాలు లేవని.. పూర్తిగా నెతన్యాహు ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు. ఖతార్ తమ మిత్ర దేశమని.. ఇకపై ఏ దాడి జరగబోదని ట్రంప్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్‌ను అందుకే చంపేశా.. నిందితుడు కీలక వ్యాఖ్యలు

అయితే అమెరికా వాదనను ఒక జర్నలిస్ట్ తోసిపుచ్చారు. ఖతార్‌లోని దోహా దాడి గురించి అమెరికాకు ముందే తెలుసని వాదించారు. ఖతార్‌లోని హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడి చేయడానికి గంట ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ట్రంప్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని.. కనీసం ముగ్గురు సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు ఈ విషయం తనతో చెప్పారని ఆక్సియోస్ రిపోర్టర్ బరాక్ రవిద్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Madyapradesh: చెల్లి మరిదితో అక్క ప్రేమాయణం.. తర్వాత ఏమైందంటే…

క్షిపణులు గాల్లోకి ఎగిరిన తర్వాత కాదు.. గాల్లోకి ఎగరక ముందే.. అనగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రంప్‌కు సమాచారం అందించినట్లుగా ముగ్గురు ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు తనతో చెప్పారని పేర్కొన్నాడు. వాస్తవంగా ఉదయం 7:45 గంటలకే ట్రంప్‌కు నెతన్యాహు నుంచి ఫోన్ కాల్ వెళ్లిందని వివరించాడు. అయితే తనతో నాల్గో అధికారి కూడా తనతో మాట్లాడాడని.. ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించినట్లు పేర్కొ్న్నాడు. ఉదయం 7:45కే ట్రంప్‌కు కాల్ వెళ్లిందని ఆయన చెప్పినట్లుగా వివరించాడు.

ఇటీవల ట్రంప్‌ను ఇదే విషయాన్ని విలేకరి మరోసారి ప్రశ్నించగా దాడి గురించి ముందు చెప్పలేదని.. దాడి తర్వాత చెప్పరని చెప్పుకొచ్చారు. దీంతో జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. విషయం చెప్పే సమయానికే క్షిపణులు గాల్లోకి ఎగిరిపోయాయని.. ఆ తర్వాతే వైట్‌హౌస్‌కు సమాచారం వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రిపోర్టర్ చెప్పేదానికి-ట్రంప్ చెప్పేదానికి ఏ మాత్రం పొంతన లేదు.

Exit mobile version