Site icon NTV Telugu

US-Iran: యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి దాడులు.. ఖమేనీ లక్ష్యంగా క్షిపణులు ప్రయోగం

Khamenei

Khamenei

బెదిరించినట్టుగానే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టాయి. శనివారం ఇరాన్‌పై భీకర దాడులకు దిగాయి. టెహ్రాన్‌లో అధ్యక్షుడి కార్యాలయం సహా ఇరాన్ వైమానిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ప్రారంభించాయి. అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక నుంచి క్షిపణులు దూసుకుపోయాయి. దీంతో టెహ్రాన్‌లో అనేక చోట్ల భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అధ్యక్షుడి కార్యాలయంపై క్షిపణులు విరుచుకుపడ్డాయని ఇరాన్ టీవీ ఛానల్స్‌ వెళ్లడించాయి. ఇక వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో అనేక మంది సైనికులు కూడా మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్ధం వారు ప్రారంభించారు. ముగింపు మేము ముగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ప్రతీకార దాడులకు ఇరాన్ సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్‌లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Exit mobile version