Site icon NTV Telugu

Asim Munir: అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్.. ఈసారి కీలక బాధ్యతలు! దేనికోసమో..!

Asim Munir

Asim Munir

పాకిస్థాన్‌లో అసిమ్ మునీర్‌కు మళ్లీ ప్రమోషన్ దక్కింది. ఆర్మీ చీఫ్‌గా ఉన్న అతడు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందాడు. తాజాగా రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్ ప్రమోషన్ పొందాడు. దేశ తొలి రక్షణ దళాల అధిపతి (CDF)గా ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నియామకానికి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోదం తెలిపారు. అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) రెండింటికీ సిఫార్సు చేస్తూ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేయగా.. దానికి ఆమోదం తెలిపినట్లు పాకిస్థాన్ అధ్యక్ష కార్యాలయం ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపింది.

ఇది కూడా చదవండి: IndiGo Flights: ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం.. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు

అసిమ్ మునీర్ 5 ఏళ్ల పాటు రక్షణ దళాల అధిపతిగా కొనసాగుతారు. అలాగే ఏకకాలంలో సీవోఏఎస్‌గా కూడా కొనసాగనున్నారు. కొత్త ఆమోదం మార్చి 19, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఏడాదే మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందాడు. అలాగే ఆర్మీ చీఫ్ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా దళాల అధిపతిగా ప్రమోషన్ లభించింది. 1965లో భారతదేశంతో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు నాయకత్వం వహించిన జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ పొందిన దేశ చరిత్రలో రెండో సైనికాధికారి మునీర్ కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Putin: అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేయొచ్చు, ఇండియా చేస్తే తప్పా.?

అయితే అసిమ్ మునీర్‌కు ప్రమోషన్ ఇవ్వడం ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ నుంచి బహ్రెయిన్‌కు వెళ్లారు. అక్కడ నుంచి లండన్‌కు చెక్కేశారు. పాకిస్థాన్‌కు దూరంగా ఉంటూ తప్పించుకుని తిరిగారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు సమాచారం. మొత్తానికి తప్పేటట్టు లేకపోవడంతో చాలా రోజుల తర్వాత షెహబాజ్ షరీఫ్ ఆమోదం తెలిపారు.

అసిమ్ మునీర్ రెచ్చగొట్టడం వల్లే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న భారతప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతినడంతో పాటు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక అమెరికా పర్యటనకు వెళ్లిన మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తాజాగా ప్రమోషన్ లభించింది. ఈ సారి ఎలా రెచ్చిపోతాడో చూడాలి.

Exit mobile version