Pakistan: పాకిస్తాన్‌కు పెద్ద కష్టమే వచ్చింది. పాక్ కొత్త సైన్యాధిపతి అసిమ్ మునీర్‌కు ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది పరిస్థితి. గాజాకు స్థిరీకరణ దళాలకు పాకిస్తా్న్ తన సైన్యాన్ని పంపించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒక పాకిస్తాన్ తన సైన్యాన్ని గాజాకు పంపితే సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పాక్ ప్రజలు అమెరికా, ఇజ్రాయిల్‌లను బద్ధ శత్రువుగా భావిస్తారు. పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తారు. ఒక వేళ తన సైన్యాన్ని పాక్ పంపించకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం, అసిమ్ మునీర్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్క పరిస్థితి అయింది.
రాబోయే కొన్ని రోజుల్లో అసిమ్ మునీర్ ట్రంప్‌ను కలిసేందుకు వాషింగ్టన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత ఆరు నెలల్లో ట్రంప్, మునీర్ రెండు సార్లు కలిశారు. గాజాలో దళాల మోహరింపుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 07, 2023 నాడు హమాస్ ఇజ్రాయిల్‌పై దారుణమై దాడికి పాల్పడి 1200 మందిని హతమార్చింది. 250 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి, ఇజ్రాయిల్ హమాస్‌పై భీకర యుద్ధం చేస్తోంది. ఇటీవల, రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దెబ్బతిన్న గాజాను పునర్నిర్మించేందు, ఆర్థిక పునరుద్ధరణ కోసం, అక్కడ పనుల్ని పర్యవేక్షించేందుకు ట్రంప్ తన 20-పాయింట్ల గాజా ప్రణాళిక కోసం ముస్లిం దేశాల నుంచి ఒక దళాన్ని కోరుతున్నారు. గాజాలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ మళ్లీ ఆయుధాలు పట్టొద్దనే లక్ష్యంతో ఈ చర్య ఉంది.
Read Also: PM Modi: ఇథియోపియాలో మోడీకి ప్రత్యేక గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం
అయితే, ఈ పరిణామాలు పాకిస్తాన్‌లో అగ్గిరాజేయవచ్చు. ఇజ్రాయిల్, అమెరికాకు మద్దతుగా పాక్ తన సైన్యాన్ని పంపితే పాక్ వ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది హమాస్-ఇజ్రాయిల్ మధ్య శాంతి కుదిరితేనే అక్కడి మత సంస్థలు తీవ్ర హింసకు పాల్పడ్డాయి. లాహోర్ నగరం రణరంగంగా మారింది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పుడు, పాక్ నేరుగా తన సైన్యాన్ని పంపితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
మరోవైపు, ఇప్పుడిప్పుడే అమెరికా-పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ మాట వినకుండా పాక్ తన సైన్యాన్ని గాజాకు పంపకుంటే అమెరికా ఆగ్రహానికి గురికావల్సిందే. పాక్ తన వద్ద ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్‌తో అమెరికా పెట్టుబడుల్ని ఆకర్షించాలని చూస్తోంది. గతంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్‌లు ఒక సూట్ కేస్‌లో రంగు రాళ్లను ట్రంప్‌కు చూపించిన ఫోటో వైరల్ అయింది. దక్షిణాసియాలో భారత్‌ను ఎదుర్కోవాలంటే అమెరికా దిక్కు అని పాక్ భావిస్తోంది.
శాంతి పరిరక్షణ కోసం దళాలను పంపడాన్ని ఇస్లామాబాద్ పరిశీలించవచ్చని, అయితే హమాస్‌ను నిరాయుధులను చేయడం “మా పని కాదు” అని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గత నెలలో అన్నారు. గత కొన్ని వారాలుగా మునీర్ ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, టర్కీ, జోర్డాన్, ఈజిప్ట్, అజర్‌బైజాన్, ఖతార్ వంటి దేశాల సైనిక, ప్రభుత్వ నాయకులను కలిశారని సైన్యం ప్రకటనలు తెలిపాయి. ఇవన్నీ గాజాలో దళాల మోహరింపు గురించి అని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
