Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని పాకిస్తాన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం కాదు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం కాదు’’ అని అన్నారు.
Pakistan: ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే, ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
దాయాది దేశం పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ, ప్రపంచ నాయకులు వారి "పెంపుడు జంతువుల" గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అందులో పరోక్షంగా పాకిస్తాన్‌ను అమెరికా పెంచి పోషిస్తున్న 'కుక్క' (పెట్)తో పోల్చారు.
Pakistan: అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా సెప్టెంబర్ 25న ఇద్దరు పాక్ నాయకులు ట్రంప్‌తో చర్చలు జరుపుతారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
అణు దాడి గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన ప్రకటనకు అమెరికా నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికా గడ్డపై పాకిస్తాన్ బెదిరింపులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అమెరికా మాజీ పెంటగాన్ అధికారి మైఖేల్ రూబిన్ తెలిపారు. పాకిస్తాన్ ఇప్పుడు “బాధ్యతాయుతమైన దేశం”గా ఉండటానికి తగినదా లేదా దాని ముగింపుకు సమయం ఆసన్నమైందా అనే ప్రశ్నలు చాలా మంది ప్రజల మనస్సులలో తలెత్తాయని ఆయన అన్నారు . మునీర్ ప్రకటనను ఒసామా బిన్…
Trump’s South Asia Strategy: నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న అగ్రరాజ్యాధినేత ఆలోచనలు, వ్యూహాలు ఏమిటి? భారత్‌ను ప్రత్యేక స్నేహితుడు అంటూనే 50% సుంకం విధించిన ఆయన తీరును ఏమని అర్థం చేసుకోవాలి. కేవలం 19% సుంకం విధించి పాకిస్థాన్‌పై ఆయన ఎందుకంత ప్రేమ కనబరుస్తున్నారు. చైనా విషయంలో ఆయన తీరు ఇండియా విషయంలో ఉన్నంత ఇదిగా లేకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ట్రంప్ మదిలో మెదిలే ప్రణాళికలు ఏమిటో తెలుసుకుందాం.. READ MORE: AP…
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటికే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించాడు. భారత్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ అధిక సుంకాలను విధిస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశాడు. 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 41 శాతానికి పెరిగిన ఈ వాణిజ్య సుంకాలు ఏడు రోజుల్లో అమలులోకి రానున్నాయి.