NTV Telugu Site icon

Putin: ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..

Putin

Putin

Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉంటే హమాస్ క్రూరదాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ కి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమస్య పరిష్కరించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు మీడియా నివేదించింది.

Read Also: Janvi Kapoor : ఏంటి జాన్వీ పాప మొత్తం చూపిస్తే ఎలా..ఇంత హాట్నెస్ కి కుర్రాళ్లు తట్టుకోలేరు..

కిర్గిజ్‌స్తాన్ వేదికగా జరుగుతున్న పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్)’ శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరయ్యారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ సమస్యకు చర్చలే ప్రత్యామ్నాయం అని పుతిన్ అన్నారు. చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి ‘టూ స్టేట్ ఫార్ములా’ను అమలు చేయడం, తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించడం, ఇజ్రాయిల్ తో శాంతి, భద్రతతో సహజీవనం చేయడానికి సహాయపడుతాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇజ్రాయిల్ క్రూరమైన దాడికి గురైంది. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయడం చాలా కీలకమని పుతన్ చెప్పారు. టూ స్టేట్ ఫార్ములాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, వేరే దేశ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు గానూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే రష్యా, కిర్గిజ్ స్తాన్ రెండు దేశాలు కూడా ఐసీసీలో భాగస్వామ్య దేశాలు కావు. వచ్చే వారం చైనాలో జరిగే బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశానికి పుతిన్ ఆ దేశానికి వెళ్లనున్నారు.