Putin: ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉంది.. పుతిన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే హమాస్ క్రూరదాడి నేపథ్యంలో ఇజ్రాయిల్ కి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సమస్య పరిష్కరించడానికి తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు మీడియా నివేదించింది.
Also Read
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
Read Also: Janvi Kapoor : ఏంటి జాన్వీ పాప మొత్తం చూపిస్తే ఎలా..ఇంత హాట్నెస్ కి కుర్రాళ్లు తట్టుకోలేరు..
కిర్గిజ్స్తాన్ వేదికగా జరుగుతున్న పూర్వపు సోవియట్ యూనియన్ దేశాల కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్)’ శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరయ్యారు. పాలస్తీనా-ఇజ్రాయిల్ సమస్యకు చర్చలే ప్రత్యామ్నాయం అని పుతిన్ అన్నారు. చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి ‘టూ స్టేట్ ఫార్ములా’ను అమలు చేయడం, తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని సృష్టించడం, ఇజ్రాయిల్ తో శాంతి, భద్రతతో సహజీవనం చేయడానికి సహాయపడుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ క్రూరమైన దాడికి గురైంది. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయడం చాలా కీలకమని పుతన్ చెప్పారు. టూ స్టేట్ ఫార్ములాకు ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, వేరే దేశ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు గానూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్(ఐసీసీ) పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే రష్యా, కిర్గిజ్ స్తాన్ రెండు దేశాలు కూడా ఐసీసీలో భాగస్వామ్య దేశాలు కావు. వచ్చే వారం చైనాలో జరిగే బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ సమావేశానికి పుతిన్ ఆ దేశానికి వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!