NTV Telugu Site icon

Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..

Imran Khan

Imran Khan

Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం, సుప్రీంకోర్టుల మధ్య ఘర్షణ తీవ్రం అయింది. స్వీడన్ వంటి కొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేస్తున్నాయి. మరోవైపు పాక్ ప్రభుత్వం, అక్కడి సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తిరగబడుతున్నారు. అతనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభిస్తోంది.

Read Also: Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్

ఇదిలా ఉంటే తాజాగా ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ రాజకీయాల్లో ఆర్మీ చీఫ్ అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని, అతడి నిర్ణయాలను అందరూ పాటిస్తారని అన్నారు. శుక్రవారం అతడి నివాసంలో ఏర్పాటు చేసిన పాకిస్తాన్ తెహ్రీక్- ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించాలని, ప్రజలంతా సుప్రీంకోర్టుకు అండగా నిలబడాలని అన్నారు. పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్ శక్తివంతమైన వ్యక్తి అని.. తాను మళ్లీ అధికారంలోకి రాకూడదని సైనిక వ్యవస్థ అవినీతి షరీఫ్-జర్ధారీల ప్రభుత్వానికి అండగా నిలుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలపై అక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ మీడియా అప్రకటిత నిషేధాన్ని విధించాయి. పాక్ సుప్రీంకోర్టులో విభజనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఇమ్రాన్, ఇది దేశానికి పెను విషాదం అని అన్నారు. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెడ్దపేరు తెచ్చే పనిచేస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యం కోరుకునే వారు సుప్రీంకు అండగా నిలబడాలని అన్నారు. దీనికి నేను ముందుండి నాయకత్వం వహిస్తా అని అన్నారు. తనను చంపడానికి దేశంలో శక్తివంతమైన సర్కిల్ ఏర్పడుతోందని ఆరోపించారు. ఐఎస్ఐ ఉన్నతాధికార మేజర్ ఫైసల్ నసీర్ ను ‘‘డర్టీ హ్యరీ’’గా పిలిచే వాడని, అతడిపై హత్యాయత్నం వెనక ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోం మినిస్టర్ రాణా సనావుల్లా ఉన్నారని ఆరోపించారు.