Site icon NTV Telugu

Donald Trump: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..

Trump (1)

Trump (1)

Breaking News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్ లోకి అనధికారికంగా ప్రవేశించిన చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. మార్ ఎ లాగో ఎస్టేట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించిన ఒక సాయుధ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరు. ఈ విషయాన్ని యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారి గుగ్లియెల్మీ ఎక్స్ పోస్టులో ధ్రువీకరించారు. ‘‘ఈ ఉదయం మార్ ఎ లాగో వద్ద సురక్షిత సరిహద్దుల్లోకి ప్రవేశించిన సాయుధ వ్యక్తిని కాల్చి చంపారు’’ అని పేర్కొన్నారు. దుండగుడి వద్ద ఒక తుపాకీ, ఫ్యూయల్ క్యాన్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సంఘటన ఈరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు జరిగిందని, మరణించిన వ్యక్తికి 20 ఏళ్లు ఉన్నట్లుగా వెల్లడించారు.

Exit mobile version