Pakistan: మేం భారత్లో కలుస్తాం.. దయచేసి కార్గిల్ రోడ్ ఓపెన్ చేయండి.. పాక్కు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Pak protests intensify in PoK as Gilgit Baltistan demands reunion with India: పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. మేం భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. తన ప్రాంతాన్ని దోపిడి చేసి పంజాబ్, సింధ్ ప్రాంతాలకు పెడుతున్నారంటూ పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆందోళన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
Ppl in #GilgitBaltistan chant slogans for REUNIFICATION with #Ladakh & demand opening of #Kargil – #Skardu road. Ppl always resisted #Pakistani moves to make #POJK a province of #Pakistan, but #India has always accommodated Pakistan on #JammuAndKashmir ignoring public sentiments. pic.twitter.com/a5x66Qf1nx
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
— Professor Sajjad Raja (@NEP_JKGBL) January 7, 2023
పాకిస్తాన్ వ్యాప్తంగా గోధుమల కోసం ప్రజలు కొట్టుకు చస్తున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంటే అదే గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం మాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్ తో కలపాలని, కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది నినదిస్తూ ర్యాలీలు చేశారు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో నిరసనలు చెలరేగుతున్నాయి.
As of Jan 6, protests continue to rage in Gilgit-Baltistan, a region administered by Pakistan in the disputed Kashmir region. Citizens protest a surge in electricity prices, tax hikes, land grabs, & wheat shortages for the 9TH consecutive day. Take a look:pic.twitter.com/sTODO987bH
— Steve Hanke (@steve_hanke) January 6, 2023
మరోవైపు భారత్ ఎప్పుడైనా పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ పై దాడి చేస్తుందో అనే భయంలో పాకిస్తాన్ ఉంది. దీంతో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో అక్కడి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. గిల్గిట్ – బాల్టిస్తాన్లకు స్వాధీనం చేసుకుంటామని గత అక్టోబర్ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మన సైనాధికారులు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో పాకిస్తాన్ లో భయాలు పెరిగాయి. దాదాపుగా 70 ఏళ్ల తరువాత పాక్ పరిస్థితి నేపథ్యంలో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రజలు భారత్ లో కలుస్తామని సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. గతంలో భారత్ లో చేరమని ఉద్యమాలు, యుద్ధం చేసిన వారు ఇప్పుడు భారత్ లో చేరుతామని చెబుతుండటం విశేషం.
Every day this week, thousands of people gathered in sub-zero temperatures in Gilgit-Baltistan to protest land-grabbing, heavy taxes, and coercion by Pakistan’s military. The region is located in Pakistan-occupied Kashmir. Take a look:https://t.co/n01qZO2VkT
— Steve Hanke (@steve_hanke) January 4, 2023
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!